సుమ అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతియసోక్తి కాదేమో.అంతలా ప్రతి కుటుంబానికి చేరువైంది.
ఒక మలయాళీ కుటుంబానికి చెందిన కూడా తెలుగు అనర్గళంగా మాట్లాడగల్గుతుంది.ఇంకా చెప్పాలంటే తెలుగువారు కూడా అంత బాగా మాట్లాడరేమో అనిపిస్తుంది.
యాంకరింగ్ విషయంలో మకుటంలేని మహారాణిగా బుల్లితెరను ఏలేస్తుంది. మొదట్లో సినిమాల్లో, సీరియల్స్ లో నటించిన సుమ తర్వాత యాంకరింగ్ వైపుగా అడుగులు వేసింది.
తన కాళ్ళ ముందే ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నా కూడా సుమ మాత్రం స్టార్ యాంకర్ గా కొనసాగుతుంది.దాదాపు దశాబ్ద కాలంగా అగ్రస్థానంలోనే కొనసాగుతూ తనకు ఎవ్వరు పోటీ లేకుండా చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు సుమకు ఇంట్లోనే పోరు మొదలైందట.అలా ఎలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోతున్నారా.
అవునండి నిజమే.సొంత కుటుంబం నుండే తనకు పోటీగా వస్తున్నారట.
కనకాల కుటుంబం నుండే మరొకరు యాంకర్ గా రాబోతున్నారని తెలుస్తుంది.కనకాల కుటుంబం నుండి సుమకు పోటీగా వచ్చే సాహసం ఎవరు చేస్తారు అని అనుకుంటున్నారా.
అది ఎవరో కాదో.సుమ భర్త రాజీవ్ కనకాల.అవును రాజీవ్ కనకాల యాంకర్ గా చేయబోతున్నాడట.ఇండస్ట్రీలో ఎంతోకాలంగా ఉంటున్న ఒక్క సినిమా కూడా రాజీవ్ కు బ్రేక్ ఇవ్వలేదు.మంచి నటుడిగా గుర్తింపు అయితే పొందాడు కానీ స్టార్ యాక్టర్ మాత్రం కాలేకపోయాడు.అందుకే ఇప్పుడు బుల్లితెరపై కనిపించబోతున్నాడట. తాజాగా ఈటీవీ ఛానెల్ వారు ఒక కామిడీ ప్రోగ్రాం ను ప్రారంభించబోతున్నారు.ఈ షో కూడా జబర్దస్త్ కమీడియన్స్ తోనే చెయ్యబోతున్నారు.ఈ షో పేరు రెచ్చిపోదాం బ్రదర్.తాజాగా ఈ ప్రోగ్రాం కు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేసారు.
ఈ ప్రోమో చుసిన నెటిజన్స్ యాకర్ సుమకు పోటీ ఇచ్చేందుకు తన భర్తే వచ్చాడు.ఇక సుమకు ఇంటి పోరు స్టార్ట్ అయ్యిందని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.