విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు రీల్ లైఫ్‌లోనూ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ రోజు నుండే మంచి టాక్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫలితాన్ని రాబట్టింది.ఇక ఈ సినిమా టోటల్ రన్ ముగించుకున్న సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.39.34 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.వెంకీ-చైతూల మ్యాజిక్ కాంబోతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా సినిమా వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 13.03 కోట్లు
సీడెడ్ – 4.51 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.62 కోట్లు
గుంటూరు – 2.72 కోట్లు
కృష్ణా – 1.83 కోట్లు
ఈస్ట్ – 2.61 కోట్లు
వెస్ట్ – 1.42 కోట్లు
నెల్లూరు – 1.10 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 32.84 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3.30 కోట్లు
ఓవర్సీస్ – 3.20 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 39.34 కోట్లు







