మీ వెయిట్ లాస్ జర్నీలో ఈ మ్యాజికల్ డ్రింక్ ను యాడ్ చేసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గొచ్చు.. తెలుసా?

ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని అధిక బరువు( overweight ) అనే పెనుభూతం పట్టిపీడిస్తోంది.అధిక బరువు అనేక జబ్బులకు మూలం.

 If You Add This Magical Drink In Your Diet, You Can Lose Weight Faster! Magical-TeluguStop.com

అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు కూడా బరువు తగ్గాలని రెగ్యులర్ గా వ్యాయామాలు, మంచి డైట్ ను ఫాలో అవుతున్నారా.? అయితే మీ వెయిట్ లాస్ జర్నీలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను యాడ్ చేసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గొచ్చు.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ డ్రింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్‌ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు సోంపు గింజలు( Anise seeds ), వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర( cumin ) వేసి దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న అవిసె గింజలు, జీలకర్ర, సోంపు తో పాటు ఆరు యాలకులు, అంగుళం దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Losefaster-Telugu Health

రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి కలిపి తీసుకోవాలి.ఈ మ్యాజికల్ డ్రింక్ ను రోజు కనుక తీసుకుంటే మీ మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా మీరు వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Tips, Latest, Losefaster-Telugu Health

అంతేకాకుండా ఈ మ్యాజికల్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.మరియు నిద్ర లేమిని దూరం చేసే సత్తా కూడా ఈ మ్యాజికల్ డ్రింక్ కు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube