పెరుగు.పాల నుంచి వచ్చేదే అయినా పాల కంటే రుచిగా ఉంటుంది.
పైగా పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రోటీన్, ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా మరియు సౌందర్య పరంగా పెరుగు బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
కానీ, పెరుగు ప్రతి రోజూ ఒకే విధంగా తినడం చాలా మందికి బోర్ కొట్టిస్తుంటుంది.ఈ క్రమంలోనే పెరుగును ఎవైడ్ చేసేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పే విధంగా పెరుగును తీసుకుంటే గనుక రుచికి రుచినీ పొందొచ్చు.అదే సమయంలో మస్తు హెల్త్ బెనిఫీట్స్ సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం పెరుగును వేరే విధంగా ఎలా తినాలో చూసేయండి.ముందు ఒక ఉల్లి పాయ, ఒక టమాటా, సగం కీర దోస తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు గిన్నెలో ఒక బౌల్ పెరుగు, కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా కీరా ముక్కులు, పావు స్పూన్ వాము పొడి, చిటికెడు ఉప్పు, కొంచెం కొత్తి మీర, కొంచెం కరివేపాకు మరియు కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసి.అప్పుడు తినండి.ఈ విధంగా పెరుగును తీసుకుంటే గనుక జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.దాంతో అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు పరార్ అవుతాయి.
అంతే కాదు, రొటీన్‌గా కాకుండా పైన చెప్పిన విధంగా పెరుగును తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
తల నొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.
నోటి పూత, కడుపు పూత సమస్యలు తగ్గుతాయి.మరియు కీళ్ల నొప్పుల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.