సినీనటి మాజీ మంత్రి ఆర్కే రోజా( Roja ) ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ కూటమి ప్రభుత్వపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇటీవల తిరుమల గోశాలలో మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 100కు పైగా ఆవులు మరణించాయి.
ఈ విషయం గురించి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ ఎంపీ గురుమూర్తి అలాగే ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ( Pawan Kalyan ) విమర్శలు కురిపించారు.

కలియుగ దైవమైన తిరుమల( Tirumala ) శ్రీవారి సన్నిధిలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే సనాతన ధర్మం ఎక్కడ అంటూ ఆమె ప్రశ్నించారు.అదేవిధంగా పవన్ కళ్యాణ్ డబ్బులకు రుచి మరిగారు అంటూ పవన్ కళ్యాణ్ గురించి రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ ( Jabardasth ) కమెడియన్ కిరాక్ ఆర్పీ ( Kirak Rp ) స్పందించారు.ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ.జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నువ్వు ఉండి డబ్బులకు రుచి మరిగావని, మీ అన్నదమ్ములను అడ్డం పెట్టుకొని 3000 కోట్లకు పైగా రూపాయలు అడ్డగోలుగా సంపాదించావని చెప్పుకొచ్చారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఈమె పార్టీలో కొనసాగుతూ ఎప్పుడో క్రిస్టియన్ గా మారిపోయిందని ఆర్పీ ఆరోపణలు చేశారు.రోజా మాదిరి పవన్ కళ్యాణ్ చేయడం లేదని, ఆయన తన కొడుకుకు బాగాలేదా ఆస్పత్రిల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.తన కొడుకు క్షేమంగా బయటపడటంతో తన భార్య తిరుపతికి వెళ్లి తలనీలాలు ఇవ్వటమే కాకుండా అన్న ప్రసాదం కోసం భారీగా విరాళాలు కూడా అందించారు.అలాంటి వారిపై రోజా ఇలా మాట్లాడడం దారుణమని ఖండించారు.
దీంతో రోజా గురించి ఆర్పి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.