కడుపు ఇన్ఫెక్షన్.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే కామన్ సమస్య ఇది.ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల తరచూ అజీర్తి, కడుపు మంట, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్, వికారం, వాంతులు, మలబద్ధకం, ఆకలి తగ్గిపోవడం, కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం వంటి లక్షణాలు తలెత్తుతుంటాయి.ఈ లక్షణాలు తగ్గాలంటే కడుపులో ఇన్ఫెక్షన్‌ను మాయం చేసుకోవాలి.
అయితే అందుకు కొన్ని కొన్ని ఉత్తమమైన ఆహారాలు ఉన్నాయి.ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగాలు. కడుపు ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.లవంగాలతో టీ తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు చప్పున తీసుకుంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.దాంతో కడుపు మంట, అసిడిటీ, గ్యాస్, వికారం, వాంతులు, అజీర్తి వంటి లక్షణాలు దూరం అవుతాయి.
కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు తప్పకుండా తమ డైట్‌లో యాలకులు ఉండేలా చూసుకోవాలి.యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫెక్షన్‌కు ఔషధంలా పని చేస్తాయి.
బంగాళదుంపతో జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవాలి.తద్వారా ఇన్ఫెక్షన్ మాయమై పొట్ట శుభ్రంగా మారుతుంది.ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.కడుపు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడేవారు పైన చెప్పిన వాటితో పాటు పసుపు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, బొప్పాయి పండు, పైనాపిల్ జ్యూస్, సోంపు వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
అలాగే శరీరానికి సరిపడా నీటిని అందించాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, సబ్జా వాటర్ వంటి వాటిని తీసుకోవాలి.అదే సమయంలో ఫాస్ట్ ఫుడ్స్, నూనెలో వేయించిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి వాటిని ఎవైడ్ చేయాలి.అప్పుడే కడుపు ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గు ముఖం పడుతుంది.