అయోధ్యలో రాముడి వేషధారణలో చిన్నారి.. ఇది దైవలీలా.. లేక మరేదైనా మాయా?

అయోధ్య రామమందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం, బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తయిన వేళ ఓ అద్భుతం జరిగింది.తొమ్మిదేళ్ల వేదిక జైస్వాల్ అనే చిన్నారి రాముడిలా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించింది.

 A Child Dressed As Ram In Ayodhya Is This A Divine Or Some Other Magic, Ayodhya,-TeluguStop.com

బాల రాముడిలా ఉన్న వేదికను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.జనం ఆమెను చూసి చూపు తిప్పుకోలేకపోయారు.

ఆ చిన్నారి రూపురేఖలు, వేషధారణ అచ్చం బాల రాముడిని తలపించేలా ఉండటంతో అంతా ముగ్ధులయ్యారు.ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేదికను చూసి పులకించిపోయారు.ఆ చిన్నారి భక్తికి, రాముడి రూపానికి ఎంతో ముచ్చటపడ్డారు.చాలామంది ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.అంతేకాదు, వేదిక తన పర్యటన గురించి ఒక పద్యం చదివి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయోధ్యలోని పండుగ వాతావరణానికి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వేదిక తల్లి దీక్షా జైస్వాల్ ( Deeksha Jaiswal )తన కుమార్తె రాముడితో ఉన్న అనుబంధం గురించి గొప్పగా చెప్పింది.వేదిక రాముడిని తన స్నేహితుడిగా భావిస్తుందని, అందుకే రాముడిలా వేషం వేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుందని తెలిపింది.పిల్లలను విమర్శించే బదులు మన సంస్కృతిని అర్థం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆమె సూచించింది.

తమ పిల్లలకు వారసత్వం గురించి నేర్పించడం ద్వారా వారి గుర్తింపు పట్ల గర్వపడేలా చేయవచ్చని ఆమె అభిప్రాయ పడింది.

బాల రాముడే ఈ చిన్నారి రూపంలో తమ ముందుకు వచ్చినట్లున్నారు అని భక్తులు నమ్ముతున్నారు.ఇది దైవలీలా, లేక మరేదైనా మాయా? అని ఆమె వీడియో చూసిన చాలామంది కామెంట్లు చేస్తున్నారు దీనిపై మీరు కూడా ఒక లుక్ చేయండి.పిల్లలకు వారి మూలాలను పరిచయం చేయడం, వారి వారసత్వం పట్ల గర్వం కలిగేలా చేయడం చాలా ముఖ్యమని కూడా కామెంట్లు పెడుతున్నారు.

వేదిక, ఆమె కుటుంబానికి అయోధ్య సందర్శన ఒక మధురమైన, జ్ఞానదాయకమైన అనుభవంగా మిగిలిపోతుందని వాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube