ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక రీసెంట్ గా పాన్ ఇండియా హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లు సైతం తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నత శిఖరాలకు పెంచుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) సైతం అందుకోలేని రికార్డులను మన తెలుగు హీరోలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోలు బాలీవుడ్ హీరోలను లెక్కచేయడం లేదు ఇక వాళ్ల సినిమాల్లో మన హీరోలు గెస్ట్ రోల్స్ లో నటిస్తే వాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుందని బాలీవుడ్ హీరోలు కోరుకుంటుండడం విశేషం… మరి ఎట్టకేలకు అమీర్ ఖాన్( Aamir Khan ) కొత్త సినిమాలో ప్రభాస్( Prabhas ) గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇంతకీ అమీర్ ఖాన్ ఎవరితో సినిమా చేస్తున్నాడనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు.
కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ ప్రభాస్ కి మధ్య మంచి బాండింగ్ ఉండటంతో రీసెంట్ గా చాలా సార్లు కలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమాలో ప్రభాస్ నటిస్తే మంచి క్రేజ్ అయితే వస్తుందనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు అలాంటి ఒక స్ట్రాటజీ ని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ నడుస్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుంది అనేది…
.