బాలయ్య డాకు మహారాజ్ మూవీ నుంచి మరో ట్రైలర్ రాబోతుందా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్!

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు( Nandamuri Natasinham Balayya Babu ) హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్.( Daku Maharaj ) ఈ సినిమాకు బాబీ( Bobby ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Balakrishna Bobby Daaku Maharaj Second Trailer Update, Balakrishna, Daaku Mahara-TeluguStop.com

ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో తప్పకుండా బాలయ్య బాబు ఖాతాళ్ల పడడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

డాకు మహారాజ్ అంటూ బాలయ్య డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ వచ్చిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది.

Telugu Balakrishna, Daaku Maharaj, Trailer, Tollywood-Movie

ట్రైలర్ వచ్చాక సినిమా మీద అంచనాలు పెరిగాయి.టెక్నికల్‌గా డాకు మహారాజ్ నెక్ట్స్ లెవెల్లో ఉందని అంతా పొగిడేశారు.అందులో బాలయ్య మార్క్ డైలాగ్స్ లేవని కొంత మంది నిరుత్సాహపడ్డారు.

కానీ బాలయ్యను అలా కొత్తగా చూపించాలని, ట్రైలర్ కొత్తగా ఉండాలనే అలా కట్ చేశానని బాబీ అన్నాడు.బాలయ్య ఫ్యాన్స్‌ కి ఎలా కావాలో అలాంటి ట్రైలర్‌ ను కూడా రెడీగానే పెట్టుకున్నానని తెలిపాడు.

ఇక ఈ ట్రైలర్ ఈ రోజు రాబోతోందట.నేడు సాయంత్రం నుంచి డాకు మహారాజ్ నుంచి రెండో ట్రైలర్ రాబోతోందట.

ఈ ట్రైలర్ ప్యూర్ మాస్ బాలయ్యను చూపిస్తారట.బాలయ్య టైపు ఊచ కోత, బాలయ్య మార్క్ డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు.

Telugu Balakrishna, Daaku Maharaj, Trailer, Tollywood-Movie

బాబీ ఈ మూవీతో ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది.అసలే సంక్రాంతి బరి.ఆపై బాలయ్య ఉండటం.సినిమాకు ఏ మాత్రం కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఊచకోతే.

అసలే గేమ్ ఛేంజర్‌కు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది.ఈ రెండు రోజులు ఎలాగూ గేమ్ ఛేంజర్ హవానే నడుస్తుంది.12న డాకు మహారాజ్ బరిలోకి దిగుతాడు.ఈ మూవీ టాక్‌ను బట్టి ఆ తరువాత సంక్రాంతి పోటీ ఎలా ఉంటుందో చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube