భోగిపళ్ళను మొదటగా పిల్లలపై ఎవరు పోయాలి... మంగళ హారతి ఎవరు ఇవ్వాలో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది జనవరి మాసంలో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారనే విషయం అందరికి తెలిసిందే.జనవరి నెలలో నాలుగు రోజుల పాటు ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

 Who Should Put Bhogipalu On The Children First Do You Know Who Should Give Manga-TeluguStop.com

సంక్రాంతి పండుగను భోగితో ప్రారంభించి ముక్కనుమతో పూర్తి చేస్తారు.అయితే భోగి రోజు ప్రతి ఒక్కరు భోగి మంటలు వేసుకుని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

అలాగే భోగి రోజు పిల్లలకు భోగిపళ్ళు పోయడం కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది.

భోగిపళ్ళు పిల్లలకు పోయటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు.

ముఖ్యంగా భోగి పళ్ళు పిల్లలపై మొదటగా ఎవరు పోయాలి.అనంతరం భోగి పళ్ళు పోసిన తర్వాత హారతి ఎవరు ఇవ్వాలి అన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా పిల్లలకు స్నానం చేయించి శుభ్రమైన దుస్తులు ధరింపజేసి తూర్పుముఖంగా కూర్చోబెట్టాలి.అనంతరం వారికి తల్లి మొదటగా పిల్లల నుదుటిపై కుంకుమ పెట్టి ఆ తర్వాత భోగి పళ్ళను వారి తలపై ఉంచి ముందుగా మూడు సార్లు కుడివైపుకు తిప్పాలి.

అలాగే మరో మూడు సార్లు ఎడమ వైపుకి తిప్పి తలపై పోయాలి.అనంతరం అక్షింతలు వేసి తన బిడ్డను ఆశీర్వదించాలి.

ఈ విధంగా మొదటగా భోగిపళ్ళను తల్లి వేసిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు అలాగే చుట్టుపక్కల వారు కూడా పిల్లలపై భోగి పళ్ళు వేసి ఆశీర్వదించాలి.ఇలా ప్రతి ఒక్కరు పిల్లలపై భోగి పళ్ళు వేసి అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ఐదుగురు వృద్ధ మహిళలు పిల్లలకు మంగళహారతి ఇచ్చి ఆ హారతి బయట పడేయాలి.ఇలా చేయడం వల్ల పిల్లల పై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube