ఏ సమయంలో దీపారాధన చేయాలో తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తప్పకుండా దీపారాధన చేస్తూ ఉంటారు.అయితే దీపారాధన ఎప్పుడూ కూడా ఒకే సమయంలో చేయటానికి వీలు కాకపోయినప్పటికీ కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తుంటారు.

 Do You Know At What Time To Do Deeparadhana, Deeparadhana,karthika Masam,lakshmi-TeluguStop.com

అంతేకాకుండా పవిత్రమైన కార్తీకమాసం మొదలవడంతో భక్తులందరూ ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ఉదయం, సాయంత్రం దీపాలను వెలిగించడం ద్వారా శుభం కలుగుతుందని భావిస్తారు.

కొందరు ఈ నెలంతా దీపారాధన చేసి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.అయితే కార్తీక మాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో వెలిగించాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం…

దీపం ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంది అంటారు.పంచభూతాల కలియకనే దీపంగా భావిస్తారు.ఇంతటి పవిత్రమైన దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వపాపాలు నశించి పోయి, శుభం కలుగుతుంది.ఎల్లప్పుడు ఏ ఇంటిలో అయితే దీపారాధన చేసి ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీ దేవత కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.దీపారాధన చేయని ఇల్లును జీవంలేని ఇంటిగా పరిగణిస్తారు.

ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రపరచుకుని దీపారాధన చేయడం వల్ల రోజంతా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది.

ప్రతిరోజు సరైన సమయంలో దీపాన్ని వెలిగించినప్పుడు మాత్రమే ఆ దీపానికి అర్థం పరమార్థం ఏర్పడుతుంది.

ప్రతిరోజు ఉదయం దీపారాధన సూర్యోదయం కాక ముందు నుంచి 10 గంటల వరకు పూజ చేసి దీపాలను వెలిగించవచ్చు.ఈ సమయములో దీపాలను వెలిగించడానికి వీలుకానివారు మనసులో ఇష్టదైవాన్ని వేడుకోవడం ద్వారా శుభం కలుగుతుంది.

అలాగే సాయంత్రం కూడా ఇంటిని శుభ్రపరచుకుని, 5 గంటల సమయం నుంచి ఆరుగంటల సమయం లోపు దీపాలను వెలిగించాలి.ఈ సమయంలో దీపాలను వెలిగించడం ద్వారా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

కార్తీకమాసంలో వెలిగించే దీపాలను కూడా ఇదే సమయంలో వెలిగించడం ద్వారా ఆ పరమశివుని అనుగ్రహం మనపై కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube