ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.05
సూర్యాస్తమయం: సాయంత్రం 05.53
రాహుకాలం: ఉ.09.45 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు: మ.01.36 నుంచి 02.58 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.10 నుంచి 12.22 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీ మూడ్ కాస్త డల్ గా ఉంటుంది.మీరు డబ్బును ఎప్పుడు ఎక్కడ ఖర్చుపెట్టాలో తెలుసుకునేకి ఈరోజు సమయం.తమాషా పరిస్థిల్లో మీరు కాస్త బాధపడుతారు.
మీ స్నేహితుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తారు.రోజు చివరికి బాగుంటుంది.
వృషభం:

మీకు ఈరోజు ఆర్ధికంగా మంచి లాభాలు ఉంటాయ్.మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధిక సహాయం అందిస్తారు.కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలరు.మీ జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
మిథునం:

అనవసరమైన విషయాలకు భయపడొద్దు.ధ్యానం చెయ్యండి అప్పుడే మానసిక వత్తిడికి గురవ్వరు.మీరు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చెయ్యడం వల్ల ఇంట్లోని వారు ఇబ్బందులు పడుతారు.ఈరోజు ఉద్యోగం విషయంలో ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం:

యోగ, ధ్యానం చెయ్యడం వల్ల రోజు ఆనందంగా గడుస్తుంది.ఈరోజు వ్యాపారపరంగా కొన్ని లాభాలు చూస్తారు.ఉదోగ్యం పరంగా మానసిక వత్తిడికి గురయ్యి ఇంట్లో వారిపై కోపాన్ని చూపుతారు.అందు వల్ల ఇంట్లో ఎవరికీ మనశాంతి లేకుండా అయిపోతుంది.
సింహం:

ఈరోజు పిల్లలతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.ఆర్ధికంగా లాభాలు ఉంటాయి.ఇంట్లో కొన్ని గొడవలు జరుగుతాయి.మీరు ప్రశాంతంగా ఉంటే మంచిది.ధ్యానం వంటివి చెయ్యడం మంచిది.అప్పుడే సమస్యలు ఉండవు.
కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు.వ్యాపారం కోసం పెట్టే పెట్టుబడులలో ఆలోచించండి.ఈరోజు కుటుంబసభ్యులతో గడపాలి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల దూరం అయిపోతారు.
తులా:

మీ ఆర్ధికంగా మంచి స్థానంలో ఉంటారు.మీ రుణాలను వదిలించుకుంటారు.కుటుంబ సభ్యులతో కొంతసేపు ఆనందంగా గడుపుతారు.ఈరోజు ఎంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.మీరు చాలా అంటే చాలా బిజీ బిజీగా ఈరోజు అంత గడుపుతారు.
వృశ్చికం:

కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల్లో పడుతారు.మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు.కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగి పోతాయి.మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు.
ధనస్సు:

ఈ రోజు వ్యాపారాల్లో భారీగా లాభాలు వస్తాయ్.గతంలో ఇతరులకు ఇచ్చిన అప్పులు తిరిగివస్తాయ్.ఈరోజు మీరు అనుకున్న అన్ని పనులు ఏలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి.కొత్త కొత్త వారిని కలిసి కొత్త కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయ్.
మకరం:

మీరు ఎవరితో అయినా అప్పు తీసుకొని ఉంటే వెంటనే ఇచ్చేయండి.లేదంటే ఇబ్బంది పడుతారు.మీ గురించి ఇతరులకు తప్పుగా చెప్పేవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు.మీరు జాగ్రత్తపడండి.మీ కుటుంబంతో కాస్త సమయాన్ని ఆనందంగా గడుపుతారు.
కుంభం:

పిల్లల వల్ల మానసిక ప్రశాంత ఉండదు.మీకు చికాకులు ఎదురవుతాయ్.ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని ఇంటికి కాకుండా ఇతర వాటికీ ఉపయోగిస్తారు.
మానసిక ఆనందంగా కోసం మీ వద్ద ఉన్న డబ్బు అంత దానంగా ఇస్తారు.దీని వల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతారు.
మీనం:

మీ తెలివితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్ధిక లాభాలు బాగా ఉంటాయి.వ్యాపారాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతారు.కుటుంబసభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.