ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.59
సూర్యాస్తమయం: సాయంత్రం.6.46
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ2.00 ల2.40
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృషభం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు అదుపులో ఉండాలి.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
ఇతరుల సహాయం అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
సింహం:
ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కాని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
తుల:
ఈరోజు మీరు మీ సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.దూర ప్రయాణాలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:
ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.
కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు కష్టపడి పని చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఇతరులతో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.వారితో సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి
.