ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగం కూడా బాగా అభివృద్ధి చెంది ఉంది.ఈ క్రమంలో రైతులు కూడా చాలా రకాల టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే రైతులు కూడా కొత్త కొత్త రకాల పంటలను పండిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎన్నో రకాల కొత్త కొత్త ఆహార పదార్థాలను అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే రైతులు వరిని ఎక్కువగా పండిస్తున్నారు.ఈ విధంగానే వరిలో కొత్త రకం వరి నీ మన దేశ వ్యాప్తంగా రైతులు పండిస్తూ ఉన్నారు.
ఈ వరిలో ఉండే నల్ల బియ్యం ఆరోగ్య ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల బియ్యంలో చాలా రకాల పోషక పదార్థాలు ఉండడం వల్ల ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను చాలామంది ప్రజలు పొందుతున్నారు.ముఖ్యంగా నల్లబియ్యంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది.
వీటితోపాటు నియాసిన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, జింక్ ఫైబర్ వంటి చాలా రకాల పోషకాలు ఉన్నాయి.ముఖ్యంగా నల్లబియ్యంలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్ల ను దూరం చేస్తుంది.
నల్లబియ్యంలో లభించే ఫ్లేవనాయిడ్స్, ఫైటోకెమికల్స్ డయాబెటిక్ వ్యాధి వారికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.
అంతేకాకుండా ఈ నల్ల బియ్యం మన శరీరంలోని అధిక కొవ్వును బయటికి పంపడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది.అందుకే డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు నల్ల బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.నల్ల బియ్యం మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను కూడా పటిష్టం చేస్తుంది.
మన శరీరంలో ఉండే చెడు వ్యర్థాలను బయటికి పంపుతుంది.