సాధారణంగా మనలో అన్ని రకాల వ్యాధులను తట్టుకునే శక్తి ఉండాలంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి.అలాంటి రోగ నిరోధక శక్తి కావాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో వెల్లడించారు.ఇందులో భాగంగానే అధికమోతాదులో ఉప్పును తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి చాలా క్షీణించిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఈ పరిశోధనలో భాగంగా డైట్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు మోతాదు ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరుగుతుందని తేలింది.రోజుకు ఆరు గ్రాముల ఉప్పును తీసుకుంటే అదికూడా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తెలిపారు.6 గ్రాముల ఉప్పు రెండు రకాల ఫాస్ట్ ఫుడ్ లు తిన్నంత దానికి సమానమని చెప్పారు.రోజుకు ఐదు గ్రాముల ఉప్పును తీసుకోవడం గరిష్టమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

తొలిసారిగా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవుతుందనే విషయాన్ని నిరూపించగలిగామని ఈ సందర్భంగా స్టడీ రీసెర్చర్ క్రిస్టియన్ కర్ట్స్ తెలిపారు.మొదటగా లిస్టెరియా అనే ఇన్ఫెక్షన్ ఎలుక పిల్లల్లో మాత్రమే కనిపించింది.అంతకుముందు జంతువులలో కొద్దిగా ఉప్పు శాతాన్ని పెంచి ఆహారాన్ని అందించడం ద్వారా100 నుంచి 1000 రెట్లు సమస్య అధికమయిందని శాస్త్రవేత్తలు చెప్పారు.
అయితే ఈ పరిశోధనను మనుషులలో రోజుకు ఆరు గ్రాముల ఉప్పును అందించి వారిని పరిశోధనలో ఉంచారు.
వారం తర్వాత వారి బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షించగా వాటిలో ఉన్న బ్యాక్టీరియల్ పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు.కేవలం ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తి క్షీణించి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరిగిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.