ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం డబ్బు ( Money ) చుట్టూనే తిరుగుతుంది.డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఖర్చు పెట్టడం కూడా మరో ఎత్తు.
డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా సంపాదించాలి అన్న విషయాలు అప్పట్లో చాణక్యుడు( Acharya Chanakya ) తెలియజేశాడు.మరి చాణక్యుడు తెలియజేసిన సంబోధనల ప్రకారం డబ్బు ఎలా ఖర్చు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బు ఖర్చు చేయడం గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే డబ్బులు ఎప్పుడూ కూడా ఇంట్లో ఏ చోట కూడా దాచకూడదని చెప్పాడు.అలాగే ఆ డబ్బును దాచుకోకుండా సరైన స్థలంలో పెట్టుబడి( Investment ) పెట్టాలని తెలియజేశారు.
అలా పెట్టుబడి పెట్టడం వలన సరైన సమయానికి మీకు ఎక్కువ డబ్బులు లభిస్తాయి.

అన్యాయాన్ని అనుసరించే వ్యక్తి వెనుక కూడా డబ్బులు అస్సలు ఉంచకూడదు.అలాంటి వ్యక్తికి అస్సలు డబ్బులే ఇవ్వకూడదని చాణక్యుడు చెప్పాడు.అయితే సాధారణంగా చాలామంది డబ్బులు ఉన్నాయని దానం మితిమీరి చేస్తూ ఉంటారు.
అయితే దానం చేయడం మంచి విషయమే కానీ, అతిగా దానం చేయడం కూడా మంచిది కాదు.అయితే తమ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే దానాలు చేయాలి.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది విపరీతంగా ఖర్చులు పెట్టేస్తున్నారు.డబ్బులు ఉన్నప్పుడు ఖర్చులు బాగా పెరుగుతాయి.

కాని డబ్బులు లేనప్పుడు మాత్రం డబ్బు విలువ( Money Value ) మనకు తెలిసి వస్తుంది.కాబట్టి డబ్బులు ఉన్నప్పుడే దాన్ని పొదుపు చేసుకుంటే రానున్న రోజుల్లో అనేక సమస్యలకి పరిష్కారం ఉంటుంది.అంతేకాకుండా చాలామంది తమ దగ్గర డబ్బులు ఉన్నాయి అని విర్రవీగుతూ ఉంటారు.అయితే అలాంటి వారు ఎప్పటికీ కూడా డబ్బును చూసి విర్రవీగకూడదు.అంతేకాకుండా డబ్బుపై ఎక్కువ వ్యామోహం కూడా చూపకూడదు.అయితే చాణక్యుడు చెప్పిన ఈ నీతి ప్రకారం డబ్బులు ఖర్చు చేస్తే రానున్న రోజుల్లో మంచి పొజిషన్లో ఉంటారు.