ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువశాతం మంది వెళ్లాలనుకునే ఎయిర్ వేస్ ఒకటుంది.అదే ‘ఖతార్ ఎయిర్ వేస్’.
( Qatar Airways ) ఈ బుల్లి గల్ఫ్ దేశం ఎయిర్ వేస్ చాలా లగ్జరీ అని అందరూ అంటూ వుంటారు.అలా అనడమే కాదు, అదే నిజం కూడా.
అందులో ఒక్కసారైనా ప్రయాణించాలని చాలా మంది కలలు కంటూ వుంటారు.అయితే ఇందులో ప్రయాణించాలంటే అంత తేలికకాదు మరి.లక్షలు వెచ్చించాల్సి వస్తుంది.బడాబాబులంతా ఈ విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తారని మీకు తెలుసా? ఇక ఖతార్ ఎయిర్ వేస్ మాత్రమే కాదు.ఇన్నాళ్లు ఖతార్ ఎయిర్ పోర్ట్ కూడా ప్రపంచంలోనే లగ్జరీ తో అత్యుత్తమ ఎయిర్ వేస్ గా ఉండేది.
ఇప్పుడు దాని స్థానం మారిందనుకోండి.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఇపుడు సింగపూర్ లోని ‘ఛాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం( Singapore Changi Airport ) పేరు కొట్టేసింది.కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ విదేశీ విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించింది.
దీంతో రెండేళ్ల క్రితం సింగపూర్ స్థానాన్ని ఖతార్ చేజిక్కించుకుంది.అయితే కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో రాకపోకలపై సింగపూర్ ఆంక్షలు ఎత్తివేసింది.
దీంతో మళ్లీ సింగపూర్ ‘ఛాంగి’ ఎయిర్ పోర్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా మనం ఈ ప్రపంచంలోనే వున్న టాప్ 10 విమానాశ్రయాల గురించి తెలుసుకుందాం.‘చాంగి’ విమానాశ్రయం ఇపుడు టాప్ వన్ స్థానంలో ఉండగా, దోహాలోని ‘హమద్’ విమానాశ్రయం ( Doha Hamad International Airport ) రెండో స్థానంలో వుంది.అదేవిధంగా టోక్యోలోని ‘హనేడా’ విమానాశ్రయం మూడో స్థానంలో ఉండగా అమెరికా విమానాశ్రయం టాప్ 10లో చోటు దక్కించుకోపోవడం గమనార్హం.
ఇంకా ఈ లిస్టులో నాల్గవ స్థానంలో ‘ఇన్చెయాన్’ సియోల్ దక్షిణకొరియా, ఐదవ స్థానంలో ‘చార్లెస్ డి గలే’ పారిస్ ఫ్రాన్స్ వున్నాయి.అంతేకాకుండా వరుసగా ఇస్తాంబుల్, టర్కీ 6వ స్థానంలో ఉంటే… మ్యూనిచ్ (జర్మనీ), జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), నరీతా (టోక్యో), బరాజస్ (మాడ్రిడ్ స్పెయిన్) 7, 8, 9,10 స్థానాల్లో వున్నాయి.