మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతుంది.ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి తన 45వ పెళ్లిరోజు( Chiranjeevi 45th Wedding Day ) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్న తరుణంలోని ఈయన కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను( Surekha ) 1980 ఫిబ్రవరి 20వ తేదీ పెళ్లి చేసుకున్నారు.

సరిగ్గా వీరి వివాహం జరిగి నిన్నటితో 45 సంవత్సరాలు కావడంతో తమ 45వ పెళ్లిరోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.23 న జరగనున్న ఇండియా పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కు హాజరు కాబోతున్నారు చిరంజీవి.ఈ క్రమంలో వారు విమానంలో దుబాయ్ కు ప్రయాణం అయ్యారు.ఈ సమయంలోనే విమానంలో తనకు కొంతమంది సెలబ్రిటీ మిత్రులు కనిపించారు అందులో నాగార్జున( Nagarjuna ) అమల( Amala ) దంపతులు అలాగే మహేష్ బాబు భార్య నమ్రత( Namrata ) కూడా ఉన్నారు.

ఈ క్రమంలోనే చిరంజీవి సురేఖ విమానంలో వారికి తారాస పడటంతో నాగార్జున అమల దంపతులు చిరంజీవికి బొకే ఇస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నమ్రత సైతం చిరంజీవి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పెళ్లిరోజు సందర్భంగా చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక సురేఖ తన విజయానికి కారణమని ఆమె తన జీవితంలోకి రావటం తన అదృష్టమంటూ ఎప్పటిలాగే సురేఖ పై పొగడ్తల వర్షం కురిపించారు.