సినిమా హిట్ కొట్టాలంటే.పవర్ ఫుల్ స్టోరీ ఉండాలి.
ఆకట్టుకునే డైలాగులు ఉండాలి.అంతకు మించి హీరో, హీరోయిన్ కాంబినేషన్ బాగుండాలి.
ఇవన్నీ జనాలకు బాగా ఎక్కాలి కూడా.అప్పుడే అనుకున్న రీతిలో సినిమా హిట్ కొడుతుంది.
లవ్ స్టోరీల్లో ముఖ్యమంగా హీరో, హీరోయిన్ల ఫెయిర్ బాగుందా? లేదా? అనే చూస్తారు ప్రేక్షకులు.వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటేనే జనాలు మెచ్చుకుంటారు.
లేదంటే అంతగా ఆదరణ దక్కించుకోలేరు.అందుక ఫేస్ ఆఫ్ ది సినిమా అంటే.
హీరో, హీరోయిన్ అని చెప్పుకోవచ్చు.వీరి ఎంపికలో దర్శకుడి సత్తా తెలిసి పోతుంది.
ఈ ఏడాది కూడా కొత్త హీరో-హీరోయిన్ల ఫెయిర్స్ మన ముందుకు రాబోతున్నాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*నాగ చైతన్య – సాయి పల్లవి
వీరిద్దరు కలిసి లవ్ స్టోరీ అనే సినిమాతో జనాల ముందుకు రాబోతున్నారు.
*సత్యదేవ్ – తమన్నా భాటియా

గుర్తుందా శీతాకాలం సినిమాతో జనాలను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది ఈ జంట.
*మహేష్ బాబు – కీర్తి సురేష్

సర్కారు వారి పాటతో తెలుగు జనాలను ఈ క్యూట్ ఫెయిర్ ఆకట్టుకోబోతుంది.
*ప్రభాస్ – దీపిక పదుకొనె

నాగ్ అశ్విన్ సినిమా ద్వారా జనాల ముందుకు వస్తుంది ఈ జంట.
*పవన్ కళ్యాణ్ – నిత్య మీనన్

భీమ్ల నాయక్ సినిమాతో తెలుగు జనాలకు వినోదం పంచబోతున్నారు ఈ హీరో, హీరోయిన్.
*అల్లు అర్జున్ – రష్మిక మందన

పుష్ప మూవీతో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు బన్నీ, రష్మిక.
*రామ్ చరణ్ – ఆలియా భట్

ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు తెర మీదకు అడుగు పెట్టబోతుంది బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా.
*అఖిల్ – పూజా హెగ్డే

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఈ జంట కనువిందు చేయబోతుంది.
*అక్కినేని నాగార్జున – కాజల్ అగర్వాల్

ప్రవీణ్ సత్తారు సినిమాతో ఈ జంట జనాల ముందుకు రాబోతుంది.
*రవితేజ – డింపుల్ హయాతి

ఖిలాడీ సినిమా ద్వారా సత్తా చాటబోతుంది ఈ న్యూ ఫెయిర్.