కారణం :
ఎండలు దారుణంగా ముదిరిపోతున్నాయి.ఏప్రిల్ లోనే 40 డిగ్రిలకు పైగా ఉషోగ్రతలు నమోదవుతున్నాయంటే .
ఇక మే నెలలో ఎలాంటి నరకం చూడాలో ఊహించండి.అడుగు బయట పెట్టడానికి ధైర్యం రావట్లేదు.
కాని ఇంట్లోనే ఉంటే పనులు అవవు కదా.బయటకి వెళ్లకతప్పదు.బయటకి వెళితే చాలామందికి ఎదురయ్యే సమస్య వడదెబ్బ.
ఈ వడదెబ్బ ఎందుకు తగులుతుంది అంటే అధిక ఉష్ణోగ్రతని శరీరం అనుభవిస్తున్నప్పుడు మన ఒంట్లోంచి చెమటలు వస్తాయి.
ఇది మన శరీరాన్ని ఎండ నుంచి కాపాడేందుకు జరిగే చర్య.కాని ఒకవేళ మన ఒంట్లో చెమట మరింతగా వచ్చేంత ద్రవ పదార్ధం లేకపోతే కాని, బాడి డీహైడ్రేట్ అయితే కాని వడదెబ్బ తగులుతుంది.
అంటే చెమట వచ్చేంత నీరు మన ఒంట్లో లేకపోవడం లేదా ఎండ వలన ఒంట్లోని నీరంతా ఇంకిపోవడం వలన వడదెబ్బ తగులుతుంది.కాబట్టి వడదెబ్బ తగలడానికి కారణాలుగా ఎండలో బాగా తిరగడం మరియు నీళ్ళు బాగా తాగకపోవడం అని చెప్పవచ్చు.
వడదెబ్బ తగిలితే చికిత్స :
* రోగిని ముందుగా నీడకి తీసుకెళ్ళి, తడిబట్టతో తుడిచి, వదులైన బట్టలతో హాస్పిటల్ తీసుకెళ్ళాలి.
* రోగికి నయం అయ్యాక ఇంట్లో కూడా కొన్ని చికిత్స పద్ధతులు పాటించాలి.
బట్టర్ మిల్క్ రోజుకి రెండు సార్లు అయినా తాగించాలి.
* పెప్పర్ మింట్ ఆయిల్, లావెండర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కలిపి, ఆ మిశ్రమంతో మర్దన చేయాలి.
* ఉల్లిగడ్డ జ్యూస్, తేనే కలిపి తాగిస్తే మంచిది.ఈ మిశ్రమాన్ని చెవులకి, ఛాతికి, పాదాలకి పట్టొచ్చు.
* కొత్తిమీర జ్యూస్, చితపండు + తేనే, ఆపిల్ సైడ్ వెనిగర్ తాగించాలి.
* శాండల్ వుడ్ పేస్ట్ ఒళ్ళంతా రాసి, ఓ పదిహేను నిమిషాల తరువాత చన్నీటతో స్నానం చేయించాలి.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు :
* ఒంట్లో ఉష్ణోగ్రత ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.అంటే శరీరాన్ని చల్లబరిచే ద్రవ పదార్థాలు, ఆహార పదార్థాలు తినాలి తాగాలి.
* వదులుగా ఉండే బట్టలు తొడగాలి.నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు.
* ఎండలో గొడుగు వాడాలి.పనులు సాయంత్రాలు ప్లాన్ చేసుకోవాలి.
* మంచి నీళ్ళు, షుగర్ లేని ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి.శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి.
* మసాలా, కారం ఎక్కువగా వేసిన వంటకాలు వద్దు.