వేసవిలో వాతావరణం( Weather in summer ) ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మండే ఎండలు, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాము.
దానికి తోడు జీర్ణ సమస్యలు, ఒంట్లో ఉష్ణం పెరగడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు కూడా కలవరపాటుకు గురిచేస్తుంటాయి.వీటికి దూరంగా ఉండాలంటే వేసవిలో కొన్ని ఆహార నియమాలు పాటించాలి.
ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కచ్చితంగా కొన్ని ఫుడ్స్ కు నో చెప్పాలి.ఈ జాబితాలో మాంసాహారం( Meat ) గురించి మొదట చెప్పుకోవాలి.
మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.పైగా ఒంట్లో వేడిని మరింత పెంచుతుంది.
జీర్ణాగ్నికి పరీక్ష పెట్టే మాంసాహారాన్ని సమ్మర్ లో ఎవైడ్ చేయాలి.లేదంటే మితంగా అన్నా తీసుకోవాలి.

అలాగే వేసవి కాలంలో కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం జోలికి అస్సలు పోకూడదు.ఎందుకంటే, ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచడమే కాకుండా జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలసట( Digestive problems, gastric trouble, fatigue ) వంటి సమస్యలకు కారణం అవుతుంది.చాలా మంది సమ్మర్ లో సాఫ్ట్ డ్రింక్స్, సోడా వంటి పానీయాలను తెగ తాగేస్తుంటారు.కానీ వీటిల్లో అధికంగా చక్కెర, కెమికల్స్ ఉంటాయి.ఇవి వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉల్లాసాన్ని కలిగించినా, తరువాత నీరసం, డీహైడ్రేషన్ కలిగిస్తాయి.

వేసవి కాలంలో డీహేడ్రైషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ రిస్క్ ను తగ్గించాలనుకుంటే మీరు తప్పకుండా టీ, కాఫీలకు ( tea and coffee )నో చెప్పాలి.కెఫిన్ అధికంగా కలిగి ఉండే ఈ పానీయాలు డీహైడ్రేషన్‌కు దారితీసేలా చేస్తాయి.
తలనొప్పు, అలసట వంటి సమస్యలకు కూడా కారణం అవుతాయి.ఎండా కాలంలో అధిక ఉప్పు గల చిప్స్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్స్ ను కూడా దూరం పెట్టాలి.
ఇటువంటి ఆహారాలు శరీరంలో నీటి లోపానికి కారణం అవ్వడమే కాకుండా కడుపుకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి.వేసవిలో శరీరం వేడి వాతావరణానికి తట్టుకోడానికి తక్కువ శ్రమ కలిగించే, తేలికపాటి, నీరు ఎక్కువగా ఉండే ఆహారం అవసరం.
కాబట్టి, తాజా పండ్లు, కూరగాయలు, ఎక్కువ నీరు ఉండే ఆహారం, దాహం తీరేందుకు పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోండి.