సాధారణంగా కొందరి అండర్ ఆర్మ్స్ డార్క్‌గా మరియు అసహ్యంగా ఉంటాయి.ఇలాంటి వారు స్లీవ్ లెస్ దుస్తులను ధరించడానికి తెగ ఇబ్బంది పడతారు.
అయితే అధిక చెమటలు, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, హెయిర్‌ను తరచూ రీమూవ్ చేయకపోవడం, గాలి సరిగ్గా ఆడకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ డార్క్‌గా మారతాయి.ఇక ఈ డార్క్ అండర్ ఆర్మ్స్‌ను ఎలా నివారించుకోవాలో తెలియక చాలా మంది తెగ సతమతమవుతుంటారు.
అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే.సులభంగా అండర్ ఆర్మ్స్ నలుపుకు చెక్ పెట్టవచ్చు.
అండర్ ఆర్మ్స్‌ను తెల్లగా మార్చడంలో కీర దోస అద్భుతంగా సహాయపడుతుంది.కీర దోసకాయ నుంచి రసం తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ రసం మరియు పసుపు కలిపి అండర్ ఆర్మ్స్‌లో అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే.మంచి ఫలితం ఉంటుంది.

అలాగే ఒక బౌల్‌లో బేకింగ్ సోడా వేసి.అందులో కొద్దిగా రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్‌లో అప్లై చేసి.డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కొద్దిగా వాటర్ చల్లి.మెల్ల మెల్లగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల క్రమంగా అండర్ ఆర్మ్స్ తెల్లగా మారతాయి.
ఇక ఒక బౌల్‌లో బియ్యం పిండి, అలోవెర జెల్ మరియు నిమ్మ రసం వేసుకుని.
బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న అండర్ ఆర్మ్స్‌లో పట్టించాలి.
పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేసినా అండర్ ఆర్మ్స్ తెల్లగా, అందంగా మారతాయి.