అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే ఈజీగా తొలగిపోతుంది!

అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్ లేదా అవాంఛిత రోమాలు అందాన్ని పాడు చేస్తాయి.చర్మ రంగును తగ్గిస్తాయి.

 Effective Home Remedy For Removing Unwanted Facial Hair! Home Remedy, Unwanted F-TeluguStop.com

అందుకే అవాంఛిత రోమాలను తొలగించేందుకు చాలా మంది మహిళలు రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు.ముఖ్యంగా షేవింగ్, వ్యాక్సింగ్ వాటిని ఎంచుకుంటారు.

కానీ అవి రెండూ చర్మ ఆరోగ్యానికి ముప్పు పెంచుతాయి.అందుకే సహజ పద్ధతుల్లో అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే ఈజీగా అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్ తొలగించుకోవ‌చ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో ఒక కప్పు ప‌చ్చి పాలు పోయాలి.

పాలు హిట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు పంచదార, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( turmaric ) వేసి కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Tips, Facial, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Un Facial-Telugu

ఇలా మరిగించిన పాలలో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి( wheat flour ), వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ స‌హాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Facial, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Un Facial-Telugu

ఆపై వేళ్ళతో చర్మాన్ని బాగా రబ్ చేసుకుంటూ వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.అనంత‌రం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని.ఏదైనా మంచి మాయిశ్చ‌రైజ‌ర్ ను రాసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్ క్రమంగా తొలగిపోతుంది.అదే సమయంలో ముఖంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు పోయి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా మెరుస్తుంది.స్కిన్ టోన్ సైతం రెట్టింపు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube