వర్షాకాలం అంటేనే వ్యాధుల కుంపటి.ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా.
ఏదో ఒక రోగంతో హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటాము.అందుకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన కేర్ తీసుకోమని నిపుణులు చెబుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే గనుక ఇమ్యూనిటీ పెరగడమే కాదు వర్షాకాంలో వేధించే ఎన్నో సీజనల్ రోగల నుండి రక్షణ లభిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఉలవలు వేసి వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న ఉలవలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పిండి చేసి స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉలవల పిండిని వేసి తిప్పుకుంటూ పది నిమిషాల పాటు ఉడికించాలి.
అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి అందులో ఓ అర గ్లాస్ వేడి పాలు కలిపితే హార్స్ గ్రామ్(ఉలవలు) డ్రింక్ సిద్ధం అవుతుంది.వర్షాకాలంలో ఈ డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ డ్రింక్‌ను ఒక గ్లాస్ చప్పున రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.సీజనల్ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదు, ఈ డ్రింక్ ను తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.దెబ్బతిన్న కాలేయం మళ్లీ కోలుకుంటుంది.కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.మూత్రంలో మంట, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరియు రక్తహీనత సమస్య నుంచి సైతం బయటపడొచ్చు.