కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు.కరోనా మహమ్మారి విజృంభణ ముందు వరకు సాధారణ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పెద్దగా పరిచయం లేదు.
టెక్నాలజీ అభివృద్ధితో ప్రతి రంగంలో కంప్యూటర్ యొక్క ప్రాధాన్యత పెరుగుతుండటంతో కంప్యూటర్ సంబంధిత ఉద్యోగులందరికీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి.
ఇతర రంగాలతో పోల్చి చూస్తే సాఫ్ట్ వేర్ కంపెనీలు అన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి.
అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల్లో ఒత్తిడిని పెంచుతోందని లింక్డ్ ఇన్ సర్వేల్లో వెల్లడైంది.చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రయాణ సమయం తగ్గుతుందని, ఇంట్లో సంతోషంగా పని చేసుకోవచ్చని భావిస్తూ ఉంటారు.
అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని పనిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారని తేలింది.ముఖ్యంగా పిల్లలకు వంట చేసే తల్లులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దేశంలోని 41 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని వెల్లడించారు.ఇంట్లో ఉంటే పర్సనల్ లైఫ్ కు, వర్క్ కు తేడా లేకుండా పోతుందని చెబుతున్నారు.
మరి కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారని అభిప్రాయపడ్డారు.ఆఫీస్ లో వర్క్ విషయంలో ఏదైనా సమస్య వెంటనే ఇతరుల సహాయసహకారాలు తీసుకోవచ్చని ఇంట్లో ఉంటే అది సాధ్యం కాదని తెలుపుతున్నారు.
చాలామంది ఉద్యోగులు ఆఫీసుల్లో పని చేయడానికి తగిన వాతావరణం ఉంటుందని ఇంట్లో పని సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.త్వరగా ఆఫీసులు ఓపెన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి వర్క్ ఫ్రమ్ అనేక మానసిక సమస్యలకు కారణమవుతోందని తెలుస్తోంది.