త్రిఫల చూర్ణం.పేరు వినే ఉంటారు.
ఆయుర్వేద వైద్యంలో దీనిని విరి విరిగా వినయోగిస్తుంటారు.ఉసిరి, కరక్కాయ, తానికాయల ఈ మూడిటిని కలిపి త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తారు.
మార్కెట్లో కూడా ఈ చూర్ణం లభిస్తుంది.మానవ శరీరానికి ఈ త్రిఫల చూర్ణం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
మరి దీనిని ఎలా వాడాలి.? మరియు ఈ చూర్ణం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ.? అన్న విషయాలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర స్పూన్ త్రిఫల చూర్ణాన్ని యాస్ చేసుకుని సేవిస్తే.
బ్రెయిన్ షార్ప్‌గా మారడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.అలాగే ఈ విధంగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.చర్మం ఎల్లుప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.
మలబద్ధకం సమస్యను నివారించడంలోనూ త్రిఫల చూర్ణం సహాయపడుతుంది.
రాత్రి నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చని నీటితో పావు స్పూన్ ఈ చూర్ణాన్ని కలిపి తీసుకుంటే.మలబద్ధకం పరార్ అవుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా పెరుగు పడుతుంది.
ఒక గ్లాస్ మజ్జిగలో అర స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిసి తీసుకుంటే.
రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.నీరసం, అలసట వంటి సమస్యలు దూరం అవుతాయి.
శరీరంలో అధిక వేడి తగ్గుతుంది.
త్రిఫల చూర్ణంతో కషాయం తయారు చేసుకుని తీసుకుంటే.వెయిల్ లాస్ అవుతారు, బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
సంతాన సామర్థ్యం పెరుగుతుంది.
ఇక రక్త హీనతకు చెక్ పెట్టడంలోనూ త్రిఫల చూపం ఉపయోగపడుతుంది.
పాలలో త్రిఫల చూర్ణంతో పాటు తేనె మరియు నెయ్యి కలిపి తీసుకుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి.ఈ విధంగా తీసుకోవడం జుట్టు కూడా ఒత్తుగా, నల్లగా పెరుగుతంది.