గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అందుకే వైద్యులు కనీసం రోజుకు ఒక గుడ్డు తీసుకోమని చెబుతుంటాయి.
గుడ్డు తింటే ఆరోగ్యమే కాదు.ఎన్నో జబ్బుల నుంచి కూడా రక్షిస్తుంది.
అయితే సాధారణంగా అందరూ గుడ్డు తినేటప్పుడు పైన పెంకు తీసి పడేస్తుంటారు.కానీ, అదే మీరు చేసే పొరపాటు.
ఎందుకంటే, గుడ్డు పెంకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.గుడ్డు పెంకులను కూడా తినొచ్చు.
అయితే పెంకులను డైరెక్ట్‌గా తినకూడదు.వాటిని నీటిలో వేసి మరిగించి.
ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటిని పొడి చేసుకుని.
తీసుకోవాలి.ఈ గుడ్డు పెంకుల పొడిని రోజుకు అర స్పూన్ చప్పున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
ముఖ్యంగా గుడ్డు పెంకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.అందువల్ల, ప్రతి రోజు గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే.
శరీరానికి కావాల్సిన కాల్షియం 90 శాతం అంది ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే పళ్లు తెల్లగా, అందంగా మారాలంటే.
గుడ్డు పెంకుల పొడితో రెగ్యులర్‌గా బ్రెష్ చేసుకోవాలి.ఇలా చేస్తే అందహీనంగా ఉన్న పళ్లు అందంగా, తళతళా మెరుస్తాయి.
గుడ్డు పెంకుల పొడిని రెగ్యులర్ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
అదే సమయంలో రక్త పోటు కూడా ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది.
అదేవిధంగా, రోగ నిరోధక శక్తి పెరగడానికి సహాయపడే విటమిన్ డి కూడా గుడ్డు పెంకుల్లో ఉంటుంది.
ఇక గుడ్డు పెంకు పొడిని వంటల్లో ఉపయోగించి కూడా తీసుకోవచ్చు.అయితే ఆరోగ్యానికి మంచిది కదా.గుండె పెంకుల పొడిని ఎక్కువగా తీసుకోరాదు.అలా చేయడం వల్ల శరీరంలో కాల్షియం ఎక్కువై.
అనేక సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.