ఈ రాశుల గ్రహ దోష పరిహారాల గురించి తెలుసా..?

రాశి ఫలాలలో రాశి అధిపతి బలంగా ఉంటే జాతకంలో ఎటువంటి దోషమున్న తొలగిపోతుంది.అలాగే రాశి అధిపతి బలంగా లేనప్పుడు జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా ఫలించవని జ్యోతిష్య శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.

 Know Graha Dosha Remedies Of Zodiac Signs Details, Graha Dosha, Graha Dosha Reme-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే రాశి అధిపతి బలంగా ఉండడం ఎంతో అవసరం.ఈ అధిపతులు బలంగా ఉండడానికి సజావుగా పనిచేయడానికి ప్రమాణిక జ్యోతిష్య గ్రంథాలు సూచిస్తున్న ప్రధానమైన పరిహారం మంత్ర జపం.ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఖచ్చితంగా ఉంటుంది.ఆ అధిష్టాన దేవతను నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన దోషాలు అన్నీ తొలగిపోతాయి.

ఆ తర్వాత శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఏ రాశుల అధిపతి బలంగా ఉన్నాడో లేదా బలహీనంగా ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశికి( Aries ) అధిపతి అయిన కుజుడు ఉచ్ఛ, మిత్ర క్షేత్రాలతో పాటు సరైన స్థానాలలో ఉన్నప్పుడు మాత్రమే యోగిస్తాడు.లేని పక్షంలో అనేక కష్టనష్టాలు తప్పవు.

ఈ కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాన్ని లేదా మంత్రాన్ని ప్రతిరోజు మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల శుభ ఫలితాలను మాత్రమే ఇస్తాడు.

Telugu Astrology, Budhudu, Gemini, Graha Dosha, Jyotishyam, Kujudu, Maha Vishnu,

ఇంకా చెప్పాలంటే మిథున రాశికి( Gemini ) అధిపతి అయిన బుధుడికి గణపతి ఆది దేవత.జాతక చక్రంలో బుధుడు బలంగా ఉన్నా లేకపోయినా వినాయకుడిని( Vinayaka ) స్మరించుకోవడం వల్ల ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది.అందుకోసం ఈ రాశి వారు వినాయక చవితిని తప్పకుండా జరుపుకోవాలి.

అలాగే సింహరాశికి( Leo ) అధిపతి అయినా రవికి సూర్య భగవానుడే ఆది నాథుడు.అందువల్ల జాతక చక్రంలో రవి ఏ స్థానంలో ఉన్న సూర్య మంత్రాన్ని స్మరించుకోవడం ఎంతో అవసరం.

ఇలా చేయడం వల్ల సిరిసంపదలకు, ఆరోగ్యానికి లోటు ఉండదు.

Telugu Astrology, Budhudu, Gemini, Graha Dosha, Jyotishyam, Kujudu, Maha Vishnu,

కన్య రాశికి అధిపతి అయిన బుధ గ్రహానికి అధిదేవత అయినా గణపతిని లేదా విష్ణువును స్మరించడం వల్ల అనేక శుభయోగాలు కలుగుతాయి.అలాగే ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది.గణపతి మంత్రాన్ని విష్ణు సహస్రనామన్ని పారాయణం చేయడం వల్ల బుధ గ్రహానికి బలం పెరిగి జాతక పరంగా దోష పరిహారం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube