పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన కూలీ కూతురు.. 600కు 600 మార్కులతో?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే మాత్రమే మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉంటాయి.చదువు, తెలివితేటలు ఉంటే మాత్రమే పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం జరుగుతుంది.

 Dindigul Laborer Daughter Nandini Historical Achievement Details Here Goes Viral-TeluguStop.com

అయితే ఎంత ప్రతిభ ఉన్నా లాంగ్వేజెస్ లో నూటికి నూరు మార్కులు సాధించే విద్యార్థులు తక్కువమంది ఉంటారు.అయితే తమిళనాడుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని మాత్రం 600 మార్కులకు 600 మార్కులు సాధించడం గమనార్హం.

తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రానికి చెందిన నందిని( Nandini ) అనే విద్యార్థిని ఇంటర్ సెకండ్ ఇయర్ లో 600కు 600 మార్కులు సాధించడం గమనార్హం.రెండు రోజుల క్రితం ఈ ఫలితాలు విడుదల కాగా తమిళంలో కూడా ఈ విద్యార్థిని నూటికి నూరు మార్కులు సాధించారు.

నందిని తల్లీదండ్రులు కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.తమ కూతురు మంచి మార్కులు సాధించడంతో నందిని తల్లీదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Nandini, Tamil Nadu-Latest News - Telugu

అన్నామలైయార్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్( Annamalaiyar Mills Girls Higher Secondary School ) లో ఈ విద్యార్థిని ఇంటర్ చదువుకున్నారు.600 మార్కులకు పరీక్షలు జరగగా 600కు 600 వస్తాయని నేను కూడా ఊహించలేదని నందిని చెప్పుకొచ్చారు.నందిని అద్భుతమైన ఫలితాలను సాధించడంతో తమిళనాడు రాజకీయ ప్రముఖుల నుంచి సైతం ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.పలువురు ప్రముఖులు ఆమె చదువు కోసం తమ వంతు సహాయం అందిస్తామని చెబుతున్నారు.

Telugu Nandini, Tamil Nadu-Latest News - Telugu

నందిని బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయిలో మార్కులు సాధించడం కొసమెరుపు.నందిని కెరీర్ పరంగా మరింత ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రతిభ ఉన్నవాళ్లకు ఏదో ఒకరోజు తమ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో కూడా తాజాగా వేర్వేరు పరీక్షల ఫలితలు విడుదల కాగా విద్యార్థులు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి సత్తా చాటడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube