సాధారణంగా చాలా మంది తమ చేతులు గరకగా, డ్రైగా ఉన్నాయని బాధ పడుతుంటారు.ఈ క్రమంలోనే చేతులను కోమలంగా మార్చుకునేందుకు రకరకాల క్రీములు, మాయిశ్చరైజర్లు వాడుతుంటారు.
అయితే చేతులను స్మూత్‌గా, గ్లోగా మార్చడంలో ఆవ నూనె గ్రేట్‌గా సహాయపడుతుంది.ఆవాల నుంచి వచ్చే ఆవ నూనెలో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి.
అందుకే చాలా మంది ఆవ నూనెను వంటలకు ఉపయోగిస్తుంటారు.ఆవ నూనెను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు.చర్మ రక్షణలోనూ ఆవ నూనె ఉపయోగ పడుతుంది.ముఖ్యంగా చేతులను నున్నగా మార్చడంలో ఎఫెక్టివ్‌గా ఆవ నూనె ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.మరి ఆవ నూనె ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో ఆవ నూనె, పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి.మెల్ల మెల్లగా ఐదు నుంచి పది నిమిషాల పాటు రుద్దుకోవాలి.
అనంతరం చల్లటి నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.
చేతులు క్రమంగా స్మూత్‌గా మారతాయి.

అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆవ నూనె, ఒక స్పూన్ బాదం నూనె వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని.బాగా మసాజ్ చేసుకోవాలి.
ఆరిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఒక బౌల్లో మూడు స్పూన్ల ఆవ నూనె, రెండు స్పూన్ల మెత్తగా ఉప్పు వేసుకుని కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి బాగా స్క్రబ్ చేసుకుని.
అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రంగా చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల డ్రైగా ఉండే చేతులు స్మూత్‌గా మరియు గ్లోగా మారతాయి.