మీ ముఖం వైట్ గా బ్రైట్ గా మారాలా? ఈ హోమ్ మేడ్ క్రీమ్ మీకోసమే!

సాధారణంగా చాలామందికి తమ ముఖ చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చుకోవాలని ఉంటుంది.ఈ క్రమంలోనే మార్కెట్ లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్( Skin Whitening ) క్రీములను కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Best Homemade Cream For Skin Whitening And Brightening!, Skin Whitening, Skin Br-TeluguStop.com

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్( Homemade Cream మాత్రం మీ ముఖ చర్మాన్ని కొద్ది రోజుల్లోనే తెల్లగా మరియు కాంతివంతంగా మారుస్తుంది.అలాగే మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పది నుంచి పదిహేను బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బాదం పప్పుకు ఉన్న పొట్టును తొలగించి మిక్సీ జార్ లో వేసి కొద్దిగా రోజ్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి బాదం పాలను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), చిటికెడు కుంకుమపువ్వు( Saffron ), నాలుగు టేబుల్ స్పూన్లు బాదం పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధం అయినట్లే.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.చర్మం టైట్ గా బ్రైట్ గా మెరుస్తుంది.వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది.

కాబట్టి ఎవరైతే ముఖాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చుకోవాలని భావిస్తున్నారో వారు తప్పకుండా పైన చెప్పిన హోమ్ మేడ్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube