హెయిర్ ఫాల్ లేదా జుట్టు రాలిపోవడం.ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మందిని ఈ సమస్య వేధిస్తోంది.
కాలుష్యం, మారిన జీవన శైలి, పోషకాహార లోపం, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందుల వాడకం, చుండ్రు తదితర కారణాల వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది.దీంతో హెయిర్ ఫాల్‌ను తగ్గించుకునేందుకు షాంపూలు మార్చడం, నూనెలు మార్చడం ఇలా ఏవేవో ప్రయత్నాలు చేస్తారు.
ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా.జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు ఊడుతూనే ఉంటే.
వారి బాధ వర్ణణాతీతం.
అయితే వాస్తవానికి కొన్ని కొన్ని ఆహార అలవాట్లు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంటాయి.
కాబట్టి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు ఊడుతుంటే.ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ఆహారాలకు దూరంగా ఉండండి.
గుడ్డు ఆరోగ్యానికి, కేశాలకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.కొందరైతే గుడ్డును పచ్చిగా కూడా తీసుకుంటారు.
కానీ, గుడ్డు ఆరోగ్య పరంగా మంచిదే అయినప్పటికీ.పచ్చిగా తీసుకోవడం వల్ల అందులో ఉండే బయోటిన్ వల్ల లోపం ఏర్పడుతుంది.
దాంతో కెరాటిన్ ఉత్పత్తి తగ్గిపోతోంది.ఫలితంగా జుట్టు రాలడం అధికం అవుతుంది.
అందవల్ల, జుట్టు రాలేవారు పచ్చి గుడ్లను తీసుకోరాదు.
అలాగే చక్కెర లేకుండా చాలా మందికి రోజు కూడా గడవదు.టీలోనూ, కాఫీలోనూ, జ్యూస్‌లోనూ ఇలా ఏదో ఒక విధంగా చక్కెరను ప్రతి రోజు తీసుకుంటారు.కానీ, హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్న వారు చక్కెరకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇక అధిక గ్లైసెమిక్ కలిగిన ఆహారాలు హెయిర్ ఫాల్‌ను రెట్టింపు చేస్తుంది.కాబట్టి, అధిక గ్లైసెమిక్ కలిగిన ఆహారాలు అంటే బ్రెడ్, శుద్ధి చేసిన పిండులు వంటి వాటికి దూరం ఉండాలి.
జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల.అందులో ఉండే ఫ్యాట్స్ అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టడమే కాదు.
హెయిర్ ఫాల్‌ను కూడా అధికం చేస్తుంది.కాబట్టి, జుట్టు అధికంగా రాలుతుంటే.
ఖచ్చితంగా జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.అలాగే హెయిర్ ఫాల్ సమస్య తగ్గాలంటే ఆల్కాహాల్ సేవించడం మానేయాల్సిందే.