Kota Srinivas Rao Gopala Rao: అలా రావుగోపాలరావు విలన్ పాత్రని కొట్టేసిన కోటా శ్రీనివాసరావు? 

ఈ ప్రపంచంలోని ఏ భాష సినిమా చూసినా మనల్ని కొన్ని అరుదైన పాత్రలు మాత్రమే వెంటాడుతుంటూ వుంటాయి.

వాటిని సినిమా పండితులు ఐకానిక్ క్యారెక్టర్స్( Iconic Characters ) అని అంటారు.

అవి ఏ నటుడు పోషించాలో నిర్ణయించేది నిర్మాత కాదు, దర్శకుడు కాదు, రచయిత కాదు, ఆఖరికి ఆ పాత్ర పోషించే నటుడు కూడా కాదు.అవును, కాలమే ఆయా క్యారెక్టర్స్ ఎవరు చేయాలో నిర్ణయిస్తుంది.

దాన్నే మనవాళ్లు అదృష్టం, దేవుడు అని కూడా అంటూ వుంటారు.ఒకానొక సమయంలో జంధ్యాల గారు( Jandhyala ) లక్ష్మీపతి పాత్ర తీరుతెన్నులు రాసుకున్నారు గానీ అది ఎవరు చేస్తే బాగుంటుంది? అనే ఆలోచన చేయలేదు.ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు “మండలాధీశుడు” సినిమా చూసి ఆ పాత్రకి కోటనే న్యాయం చేస్తాడు అని, నిర్మాత రామానాయుడు గారిని కలిసాడట.

అయితే, ఆ సమయంలో రావుగోపాలరావు( Rao Gopala Rao ) హవా బాగా నడుస్తుంది, కానీ ఊహించని విధంగా ఆ క్యారెక్టర్ కోట( Kota Srinivasa Rao ) గారికి దక్కింది.ఒకవేళ జంధ్యాల గారు “మండలాధీశుడు” సినిమా( Mandaladeesudu ) చూడకపోయి ఉంటే ఖచ్చితంగా లక్ష్మీపతిగా రావుగోపాలరావునే నటించేవారు.దాదాపు 20 రోజులపాటు నిర్మాత రామానాయుడు, దర్శకుడు జంధ్యాల గార్ల మధ్య ఈ వాదన నడిచింది, ఆయనేమో రావుగోపాలరావు అని, ఈయనేమో కోటశ్రీనివాసరావు అని.చివరికి జంధ్యాల గారు ‘సార్ టెస్ట్ షూట్ చేద్దాం.మీకు ఏమాత్రం అసంతృప్తిగా అనిపించినా మీరు చెప్పినట్టే నడుచుకుంటాను’ అని అన్నడట.

Advertisement

దాంతో కోట గారిని పిలిపించి లక్ష్మీపతిగా( Lakshmipathy ) మార్చారు, కోట కూడా తల గోక్కుంటూ అలాగా, మొదట ఈ పాత్రను రావుగోపాలరావుతో అనుకున్నారా, అలాగా? ఇప్పుడు నేనేం చేయాలి? ఆయా పెద్ద నటుడు.నాకంటే అతనయితేనే అవుంటుందేమో? అంటూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రెచ్చిపోయాదట.ఇంకేముంది కట్ చేస్తే ‘అహ నాకేంటి?’ అనే కోటా మేనరిజం జనాలకి విపరీతంగా నచ్చిందట.ఇక ఆ షూటింగ్ సమయంలోనే రామానాయుడు( Ramanaidu ) కోట శ్రీనివాసరావు గారికి మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చేవేశాడట.

అది అసలు విషయం.ఇక ఆ సినిమాలో కోట యాక్టింగ్ చూసి , సగటు సినిమా ప్రక్షకుడు కూడా ఎగిరి గంతులు వేశారట.

ఇక లక్ష్మీపతి అనే పాత్ర కోటగారి సినీ జీవితానికి కోహినూర్ లాంటిది అనడంలో అతిశయోక్తి లేదు.ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్?.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు