ఫేస్ మొత్తం టాన్ అయిందా.. 20 నిమిషాల్లో రిపేర్ చేసుకోండిలా..!

ప్రస్తుత వేసవి కాలంలో స్కిన్ టాన్( Skin Tan ) అయిపోవడం అనేది చాలా అంటే చాలా కామన్.ఎండలో తిరిగినప్పుడు ఫేస్ మొత్తం టాన్ అయిపోతూ ఉంటుంది.

 Repair Your Tanned Face With This Home Remedy Details, Tanned Face, Skin Care,-TeluguStop.com

సరిగ్గా అదే సమయంలో ఏదైనా ఫంక్షన్ లేదా మీటింగ్ ఉందంటే టాన్ అయిన ఫేస్ ను ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థం కాక హైరానా పడిపోతూ ఉంటారు.కానీ ఇకపై ఆ టెన్షన్ మీకు అక్కర్లేదు.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీ గురించి తెలుసుకుంటే టాన్ అయినా ఫేస్ ను 20 నిమిషాల్లోనే రిపేర్ చేసుకోవచ్చు.

Telugu Tips, Skin, Skin Care, Skin Care Tips, Suntan, Face-Telugu Health

అందుకోసం ముందుగా మిక్సీ జార్ లో రెండు బీట్ రూట్( Beetroot ) స్లైసెస్, రెండు క్యారెట్( Carrot ) స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుని కలుపుకోవాలి.

ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టుకున్న వాటర్ మరియు సరిపడా బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Skin Care, Skin Care Tips, Suntan, Face-Telugu Health

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ హోమ్ రెమెడీని ట్రై చేశారంటే ఒక్క వాష్ లోనే ఫేస్ పై టాన్ మొత్తం తొలగిపోతుంది.

స్కిన్ డీప్ గా క్లీన్ అవుతుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి మృత‌ కణాలు తొలగిపోతాయి.

చర్మం తాజాగా కాంతివంతంగా మారుతుంది.అలాగే ఈ రెమెడీని మీరు వారానికి రెండుసార్లు ప్రయత్నించడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.మొటిమలు బెడద సైతం తగ్గు ముఖం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube