ఫేస్ మొత్తం టాన్ అయిందా.. 20 నిమిషాల్లో రిపేర్ చేసుకోండిలా..!
TeluguStop.com
ప్రస్తుత వేసవి కాలంలో స్కిన్ టాన్( Skin Tan ) అయిపోవడం అనేది చాలా అంటే చాలా కామన్.
ఎండలో తిరిగినప్పుడు ఫేస్ మొత్తం టాన్ అయిపోతూ ఉంటుంది.సరిగ్గా అదే సమయంలో ఏదైనా ఫంక్షన్ లేదా మీటింగ్ ఉందంటే టాన్ అయిన ఫేస్ ను ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థం కాక హైరానా పడిపోతూ ఉంటారు.
కానీ ఇకపై ఆ టెన్షన్ మీకు అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ గురించి తెలుసుకుంటే టాన్ అయినా ఫేస్ ను 20 నిమిషాల్లోనే రిపేర్ చేసుకోవచ్చు.
"""/" /
అందుకోసం ముందుగా మిక్సీ జార్ లో రెండు బీట్ రూట్( Beetroot ) స్లైసెస్, రెండు క్యారెట్( Carrot ) స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుని కలుపుకోవాలి.
ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టుకున్న వాటర్ మరియు సరిపడా బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ హోమ్ రెమెడీని ట్రై చేశారంటే ఒక్క వాష్ లోనే ఫేస్ పై టాన్ మొత్తం తొలగిపోతుంది.
స్కిన్ డీప్ గా క్లీన్ అవుతుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలు తొలగిపోతాయి.
చర్మం తాజాగా కాంతివంతంగా మారుతుంది.అలాగే ఈ రెమెడీని మీరు వారానికి రెండుసార్లు ప్రయత్నించడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.మొటిమలు బెడద సైతం తగ్గు ముఖం పడుతుంది.