మనం నివసించే ఈ భూలోకానికి అష్ట దిక్పాలకులు ఉన్నారనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.వాస్తు శాస్త్రం ఈ విధంగానే ఏర్పడింది.
అయితే ఏ దిక్కుకు ఏ అధిపతి ఉన్నాడనే విషయం మాత్రం.వాస్తు శాస్త్ర నిపుణులకు తప్ప మరెవరికీ తెలియదు.
అయితే అసలు అష్ట దిక్పాలకులు అంటే ఎవరు? ఎవరు ఏ దిక్కుకు అధిపతి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు మొత్తం ఎనిమిది దిక్కులు ఉన్నాయి.
అందులో తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి.ఈయన భార్య శచీదేవి.
వాహనంగా ఐరావతాన్ని వాడుతుంటాడు ఇంద్రుడు.ఆగ్నేయ దిశకు అగ్ని అధిపతి.
స్వాహాదేవి ఆయన భార్య.అంతే కాదండోయ్ తగరు ఈయన వాహనంగా చెబుతుంటారు.
దక్షిణ దిశకు యముడు అధిపతి.ఈయన భార్య పేరు శ్యామలా దేవి.
మహిషం ఈయన వాహనం.నైఋతి దిక్కుకు నిరృతి అధిపతి.
ఆయన భార్య పేరు దీర్ఘా దేవి.ఈయన వాహనం గుర్రం.
పడమర దిక్కుకు వరుణుడు అధిపతిగా చెబుతుంటారు.
కాళికా దేవి ఈయన భార్య.మొసలిని వాహనంగా వాడుతుంటాడు వరుణ దేవుడు.వాయుయ్వ దిశకు వాయు దేవుడు అధిపతి.
ఈయన భార్య అంజనా దేవి.లేడి ఈయన వాహనంగా చెబుతుంటారు.
ఉత్తరం దిశకు అధిపతి కుబేరుడు.చిత్ర రేఖాదేవి ఈయన భార్య.
నరుడిని వాహనంగా వాడుతుంటాడు కుబేరుడు.ఈశాన్యం దిక్కుకు ఈశానుడు అధిపతి.
ఈయన భార్య పేరు పార్వతి.ఈయన వృషభాన్ని వాహనంగా వాడుతుంటాడు.