“Prevention is better than cure”.ఇంగ్లీషులో చాలా ప్రాచుర్యం పొందిన సామెత ఉంది.అంటే నిరోధించడం నయం చేయడం కన్నా మంచిది.నిజమే కదా.సమస్య వచ్చాక, దానితో ఇబ్బందిపడుతూ పోరాడే బదులు, అసలు సమస్యే రాకుండా అడ్డుకుంటే మంచిది కదా.మరీ ముఖ్యంగా డయాబెటిస్ లాండి జబ్బు రాకుండా నిరోధించడం మన శరీరానికి, భవిష్యత్తుకి ఎంతో అవసరం.మరి డయాబెటిస్ రాకుండా అడ్డుకునేదెలా? ఏం తినాలి?
* “Eat an apple on going to bed, And you’ll keep the doctor from earning his bread.” ఇది కూడా ఒక ఇంగ్లీషు సామేత.ఆపిల్ పండు రోజుకి ఒక్కటైనా తినండి.అపిల్ లో యాంథోసియానిన్ ఉంటుంది.ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది.
* దాల్చిన చెక్క పొడిని బ్రెడ్ పై చల్లుకోని తినటం, లేదా కాఫీ, టీలో కలుపుకోని తాగడం అలవాటు చేసుకోండి.
ఇది ఇన్సులిన్ ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
* పసుపు ఎన్నో రోగాలకు చెక్ పెడుతుంది.
ఇందులో ఉండే కర్యుమిన్ మధుమేహం వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గిస్తుంది.కాబట్టి తినే ఆహారాల్లో పసుపు వాడండి.
* రెడ్ వైన్ ని అతిగా కాకుండా, ఒక లిమిట్ లో తాగితే రెడ్ వైన్ కూడా డయాబెటిస్ కి చెక్ పెడుతుంది.
* స్ట్రాబెర్రి కొలెస్టెరాల్ మీద చాలా బాగా పనిచేస్తుంది.
ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచేందుకు సహాయపడుతుంది.
* స్పినాచ్ వలన డయాబెటిస్ వచ్చే అవకాసం 14% తగ్గుతుందని బ్రటిష్ లో జరిగిన ఒక అధ్యయనం ద్వారా తెలిసింది.
కాబట్టి స్పినాచ్ ను ఇష్టపడండి.