ముడతలు.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
యాబై, అరవై ఏళ్ల తర్వాత చర్మంపై ముడతలు పడటం సర్వ సాధారణం.కానీ, ఈ మధ్య కాలంలో పాతిక, ముప్పై ఏళ్ల వారే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.
దాంతో యంగ్ లుక్ పోయి.చూసేందుకు ముసలి వారిలా కనిపిస్తున్నారు.
అయితే చర్మంపై ముడతలు పడటానికి చాలా కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా మనం చేసే కొన్ని కొన్ని తప్పుల కారణంగా కూడా ముడతలు ఏర్పడతాయి.
మరి మనం చేసే ఆ మిస్టేక్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
సహజంగా చాలా మంది మాయిశ్చరైజర్ ను ఎవైడ్ చేస్తుంటారు.
అందులోనూ ఆయిలీ స్కిన్ వారు మాయిశ్చరైజర్‌ను దరి దాపుల్లోకి కూడా రానివ్వరు.కానీ, ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ తగ్గిపోయి.
ముడతలు, స్కిన్ డ్రై అయిపోవడం జరుగుతుంది.అందుకే ప్రతి ఒక్కరూ తన స్కిన్ కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్‌ను ఎంచుకుని వాడాల్సి ఉంటుంది.
అలాగే కొందరు తరచూ చేతులతో ముఖాన్ని తాకుతూనే ఉంటారు.ఇలా అస్సలు చేయరాదు.చేతులతో ఎక్కువగా తాకడం వల్ల.వేళ్ళలోని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ముఖంపై పెరుకుపోయి ముడతలు, మొటిమలు ఏర్పడతాయి.
ఇటీవల కాలంలో నిద్రను నిర్లక్ష్యం చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.అయితే శరీరానికి సరిపడా నిద్ర లేకపోయినా.ముడతలు, సన్నని గీతలు, చర్మ కాంతి క్షీణించడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రోడెక్ట్స్ ను వాడటం, రాత్రి నిద్రించే ముందే మేకప్ తీయకుండానే పడుకోవడం వల్ల కూడా చర్మంపై ముడతలు ఏర్పడతాయి.సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్లా ముడతల సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఇక చర్మాన్ని క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంచుకునేందుకు చాలా మంది తరచూ ఫేస్ వాష్ చేసుకుంటారు.
కానీ, సబ్బులు యూజ్ చేసి ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే.చర్మం కఠనంగా మారిపోతుంది.మరియు వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి.