చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు.కానీ అతను మాత్రం డాక్టర్ వృత్తి నుండి యాక్టర్ గా మారాడు.
టాలీవూడ్ ఇండస్ట్రీలో అన్న, తమ్ముడు తదితర ఈ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ టాలీవుడ్ నటుడు భరత్ రెడ్డి అందరికి సుపరిచితమైన వ్యక్తి.ఇక భరత్ రెడ్డి మొదట్లో విలన్ పాత్రలో కూడా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
భరత్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తూనే కళామతల్లి సేవలో నటుడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.అయితే వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే రోగులను పరిశీలించిన ఆయన 100లో 70 మందికి మధుమేహం ఉండటం చూసి ఆశ్చర్యానికి గురైయ్యాడు.
ఇక చిరుధాన్యాలతో తయారు చేసే వంటలను తినమని సలహా చెప్పువాడు.

అయితే కొంత మంది తన సలహాలను పాటిస్తూ ఆరోగ్య వంతులైన వారు ఉన్నారు.ఇక మరికొంత మందికి చిరుధాన్యాలతో ఎలా వంట చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు.అయితే ఈ విషయాన్ని గ్రహించిన భరత్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్‘ సహకారంతో హైదరాబాద్‌లో చిరుధాన్యాలతో ఆహారం తయారు చేయాలని సంకల్పించారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇక భరత్ తన సోదరి ప్రోత్సాహంతో ఫిల్మ్ నగర్‌లో ‘మిల్లెట్ మార్వెల్స్’ పేరుతో తొలి కేంద్రాన్ని ప్రారంభించారు.ఇక అందులో ‘మిల్లెట్ మార్వెల్స్’లో కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, కిన్వినా ఇలా ఆరు రకాలతో ఆహారాన్ని తయారు చేయిస్తున్నారు.అంతేకాదు.అల్పాహారంతో పాటు భోజనం, స్నాక్స్ అందజేస్తున్నారు.ఇక ప్రతి శుక్ర, ఆదివారాల్లో ధమ్ బిర్యానీ సిద్ధం చేస్తున్నారు.ప్రారంభంలో రుచి నచ్చాకే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేవారంట.
ఇక అలా నెమ్మది నెమ్మదిగా చాలా మంది భరత్ రెడ్డి చిరు ఆహారానికి అలవాటు పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు.