జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) రాజీనామాతో ఖాళీ అయిన కెనడా ప్రధాని పదవికి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియకు ఆదివారంతో తెరపడనుంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఉన్న వేళ ఆయనను కొత్త ప్రధాని ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది.2013 నుంచి లిబరల్స్‌కు నాయకత్వం వహించి.2015లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిన్ ట్రూడో అత్యంత పేలవమైన పరిపాలనతో పాటు అంతర్గతంగా అసమ్మతి కారణంగా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

దీంతో అధికార పార్టీకి ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది.మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరీనా గౌల్డ్, ఫ్రాండ్ బేలిస్‌లు( Mark Carney, Chrystia Freeland, Karina Gould, Fran Bayliss ) ప్రధాని రేసులో ఉన్నారు.వీరిలో ఫ్రీలాండ్, కార్నీ మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది.
మార్క్ కార్నీ.బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్‌గా పనిచేశారు.
అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు తొలి బ్రిటీషేతర గవర్నర్‌గా సేవలందించారు.ఇక క్రిస్టియా ఫ్రీలాండ్ విషయానికి వస్తే డిసెంబర్‌లో రాజీనామా చేసే వరకు ట్రూడో కేబినెట్‌లో ఆయన తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా నిలిచారు.
రాజీనామా సమయంలో క్రిస్టియా రాసిన లేఖ ట్రూడో రాజీనామాకు దారి తీసింది.

ఫ్రీలాండ్, కార్నీలు ( Freeland, Carneys )తాము ప్రధానిగా ఎన్నికైతే ట్రంప్ విధానాల వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడంపై దృష్టి పెడతామని తెలిపారు.కొత్త లిబరల్ పార్టీ నాయకుడిని దాదాపు 1,40,000 మంది పార్టీ సభ్యులు రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.ఆదివారం సాయంత్రం కల్లా ఫలితం వెలువడనుంది.
మరోవైపు.గృహ సంక్షోభం, పెరుగుతున్న వలసలు ఇతర సమస్యలతో కిందా మీద పడుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు గతంలోనే భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ సారథ్యంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) షాకిచ్చిన సంగతి తెలిసిందే.
ట్రూడో ప్రభుత్వానికి ఆ పార్టీ మద్ధతును ఉపసంహరించుకోవడంతో కెనడా ప్రభుత్వం మైనారిటీలో పడింది.దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం కెనడాలో ఫెడరల్ ఎన్నికలు 2025 అక్టోబర్ చివరినాటికి జరగాల్సి ఉంది.







