శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి.రెగ్యులర్ గా మన బాడీకి ప్రోటీన్ ను అందించాలి.
అలాగే జుట్టుకు కూడా ప్రోటీన్ ఎంతో అవసరం.ఆహారం ద్వారా కొంత ప్రోటీన్ జుట్టుకు వెళ్తుంది.
అలాగే పై పై పూతల ద్వారా మరికొంత ప్రోటీన్ ను జుట్టుకు అందిస్తే ఎన్నో సమస్యలను అడ్డుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను నెలలో కేవలం మూడు సార్లు వేసుకుంటే ఎన్నో లాభాలు మీ సొంతం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతుల పొడిని వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, ఐదు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఒక ఎగ్ ను బ్రేక్ చేసి వేసుకుని మరోసారి మిక్స్ చేసి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను నెలలో మూడు సార్లు కనుక వేసుకుంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.దాంతో జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.
అంతేకాదు ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.జుట్టు చివర్లు తరచూ చిట్లకుండా ఉంటుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.స్కాల్ప్ ఆరోగ్యంగా కూడా మారుతుంది.కాబట్టి తప్పకుండా ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.జుట్టు సంబంధిత సమస్యలకు బై బై చెప్పండి.