కన్నప్ప సినిమాతో( Kannappa ) మంచి విజయాన్ని సాధించాలని చూస్తున్న మంచు విష్ణు( Manchu Vishnu ) ఈ సినిమా మీద భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు.ఇప్పటివరకు మంచు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మంచి సక్సెస్ ని సాధిస్తే తనకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది.
లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి రావచ్చు… ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ గాని, టీజర్ గాని ప్రేక్షకులకు కొంతవరకు మెప్పించాయి.కానీ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా లీడ్ అనేది తెలియదు.

ఇక మీదట ఆయన ఇండస్ట్రీలో తన మనుగడ ను కొనసాగిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas ) ఉన్నాడనే ఒకే ఒక కారణంతో సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రని క్రియేట్ చేస్తే పర్లేదు, కానీ ప్రభాస్ పాత్ర ఏ కొంచెం తగ్గినా కూడా ఆయన అభిమానులు చాలా వరకు నిరాశ పడే అవకాశాలైతే ఉన్నాయి.

అందుకోసమే ఆయన పాత్ర కోసం స్పెషల్ కేర్ తీసుకొని మరి షూట్ చేసినట్టుగా తెలుస్తోంది.ఇక మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీపడుతున్న ప్రభాస్ ను ఈ సినిమాలో చేర్చడం వల్ల ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి.మరి ఈ సినిమా టాక్ ను బట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత పెద్ద సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమాలో నటించడం ఆయనకు ప్లస్ గా మారుతుందా? లేదంటే మైనస్ అవుతుందా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
.







