శ్రీలీల.( Sreeleela ) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.రవితేజ, నితిన్, వంటి హీరోల సరసన నటించి మెప్పించింది.ఇకపోతే ప్రస్తుతం తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూనే వరసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.అందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రం రాబిన్ హుడ్.( Robinhood ) నితిన్( Nithin ) హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉంది హీరోయిన్ శ్రీ లీల.
ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా విలేకరులతో ముచ్చటించింది.సంవత్సరం తర్వాత మీరు హీరోయిన్గా నటించిన సినిమా వస్తోంది? కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్నప్పుడు విరామం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించగా.మధ్యలో ఇలా ఒక ఏడాది విరామం వస్తుందని ముందే నాకు ఒక అంచనా ఉంది.
అందుకు కారణం నా చదువు.ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉండటంతో పరీక్షలకు సన్నద్ధం కావడానికి విరామం తీసుకున్నాను.
ఆ సమయంలో చాలా సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది.మంచి కథల్ని చేయలేకపోయానే అనే బాధ కలిగింది.
కానీ చదువు కూడా ముఖ్యమే కదా అని తెలిపింది.

ఈ సినిమా కోసం మొదట రష్మిక ( Rashmika ) ఎంపికయ్యారు కదా.మరి ఆ స్థానంలో మీ ఎంపిక ఎలా జరిగింది? అని ప్రశ్నించగా.రష్మికకు డేట్స్ కుదరకపోవడంతోనే చేయలేదు.
అప్పుడే దర్శకుడు వెంకీ కుడుముల నాకు ఫోన్ చేసి చెప్పారు.రష్మికకి బాగా నచ్చిన పాత్ర ఇది.మేమిద్దరం స్నేహితులం కదా.పుష్ప2 చిత్రీకరణలో కలుసుకున్నప్పుడు ఈ సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాము.నాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది తను.నాకూ ఈ కథ, పాత్ర బాగా నచ్చింది చెప్పుకొచ్చింది శ్రీ లీలా.ఈ మధ్య ఎక్కువగా హిందీ పరిశ్రమలో కనిపిస్తున్నారు.అటువైపు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారా? అని అడగగా.

తెలుగు చిత్ర పరిశ్రమ నా ఇల్లు.ఎక్కడికి వెళ్లినా నేను తెలుగమ్మాయినే, నా ప్రాతినిధ్యం తెలుగుకే.ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా, అన్ని భాషల్నీ బ్యాలెన్స్ చేస్తాను తప్ప, ఎక్కడికో వెళ్లిపోవడం అంటూ ఉండదు.చదువుకుని రావడానికని వేరే ఊరికి వెళుతున్న మన అమ్మాయికి ఎలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తామో, అలా నాకూ చెబుతున్నారు ఇప్పుడు.
ఒక తెలుగు అమ్మాయిగా అందరూ గర్వపడేలా చేయాలన్నదే నా అభిమతం అని తెలిపింది శ్రీ లీలా.ఈ సందర్బంగా శ్రీ లీలా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.