రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం.అందుకే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందే రోడ్డు గుర్తులపై టెస్ట్ పెడతారు.
కొన్ని గుర్తులు మనకు ఈజీగానే తెలిసిపోతాయి, కానీ కొన్ని మాత్రం అంతుపట్టవు.అలాంటి ఓ గుర్తు గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
రెండు రోజుల క్రితం ఓ ట్రాఫిక్ సబ్-ఇన్‌స్పెక్టర్( Traffic Sub Inspector ) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఇప్పటికే 20 లక్షల మందికి పైగా చూశారు, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, ఓ వింత రోడ్డు గుర్తు( Road Sign ) గురించి ఆయన వివరించారు.“ఈ ముఖ్యమైన సమాచారం పంచుకున్నందుకు థాంక్స్ సార్” అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఆ వీడియోలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఒక రోడ్డు గుర్తు పక్కన నిలబడి దాని గురించి చెప్పారు.ఆ గుర్తు ఎలా ఉందంటే, పైన ఒక దీర్ఘచతురస్రాకారపు బాక్స్ (డబ్బా), దాని కింద వంకర టింకర గీత (జిగ్ జాగ్ లైన్) ఉంటుంది.ఈ గుర్తుకు అర్థం ఏంటంటే “ముందు జాగ్రత్త, మీ వాహనం పైకి తగిలేలా ఓవర్‌హెడ్ కేబుల్స్( Overhead Cable ) (పైన వేలాడే కరెంట్ లేదా కమ్యూనికేషన్ వైర్లు) ఉన్నాయి” అని హెచ్చరిక.ఈ వైర్లు కొన్నిసార్లు తెగిపోయి కిందకు వేలాడే ప్రమాదం ఉంది.
చాలా మందికి ఈ గుర్తు అర్థం తెలియకపోవడం వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోరు.కానీ వేగంగా వెళ్తున్న వాహనానికి ఆ తెగి వేలాడుతున్న వైరు తగిలితే బండి డ్యామేజ్ అవ్వడమే కాదు, ఆ వైర్లు కరెంట్ వైర్లైతే ఒక్కోసారి మంటలు అంటుకుని ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు.ఈ గుర్తును ముందుగానే గమనిస్తే, డ్రైవర్ అప్రమత్తమై అలాంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
“డ్రైవర్లందరూ ఈ గుర్తు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు.ఓవర్‌హెడ్ కేబుల్స్ ఉన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా వెళ్లండి” అని ఆ పోలీస్ ఆఫీసర్ సూచించారు.ఈ వీడియో దెబ్బకు చాలా మందిలో ఈ గుర్తుపై అవగాహన పెరిగింది.“అరెరె, ఇన్నాళ్లూ ఈ గుర్తు అర్థం తెలియదే చెప్పినందుకు చాలా థాంక్స్ సార్” అంటూ కామెంట్ల సెక్షన్‌లో కృతజ్ఞతలు వెల్లువెత్తాయి.