నీరసం.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.ఒక్కోసారి నీరసం పట్టుకుంటే వదలనే వదలదు.దాంతో ఎప్పుడూ మూడాఫ్‌లోనే ఉంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.మరియు తరచూ విశ్రాంతినే కోరుకుంటారు.
ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా? అయితే చింతించకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ ను తీసుకుంటే నీరసం పరార్ అవ్వడమే కాదు మళ్లీ మళ్లీ రాకుండా కూడా ఉంటుంది.
మరి నీరసాన్ని తరిమికొట్టే ఆ సూపర్ డ్రింక్ ఏంటో.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.? తెలుసుకుందాం పదండీ.
ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు మిరియాలు, నాలుగు వాల్ నట్స్, ఒక యాలక్కాయ, అర స్పూన్ గసగసాలు, నాలుగు స్పూన్ మఖానాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.గ్లాస్ కొవ్వు తీసేసిన పాలు పోయాలి.పాలు కాస్త వేడి అవ్వగానే అందులో ముందుగా తయారు చేసిన పొడి వేసి బాగా మరిగించాలి.
చివరగా అర స్పూన్ ఆవు నెయ్యి, వన్ స్పూన్ నల్ల బెల్లం తురుము కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ టేస్టీ అండ్ హెల్తీ మిల్క్‌ను గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుని బ్రేక్‌ఫాస్ట్ సమయంలో సేవించాలి.రెండు రోజులకు ఒక సారి ఈ మిల్క్‌ను తయారు చేసుకుని సేవిస్తే.
ఎలాంటి నీరసమైనా తగ్గిపోయి శరీరం ఫుల్ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మారుతుంది.
అంతే కాదు, ఈ పాలను తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
మరియు శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.