పాలకూరతో శరీరానికి దొరికే అధ్బుతమైన లాభాలు

మనకు బాగా తెలిసిన ఆకుకూర పాలకూర.మొత్తం ఆసియా ఖండంలో .

 Amazing Benefits Of Spinach-TeluguStop.com

ఆకు కూర అంటే ఇదే.పాలకూర సంవత్సరం పొడవున మార్కెట్లో దొరుకుతుంది.పాలకూరకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే, ఈ ఆకుకూరలో జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మాన్గానీజ్ లాంటి మినరల్స్ తో పాటు, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్ లాంటి విటమిన్స్, బేటా కరోటిన్, లుటిన్, జాన్తెన్, క్లోరోఫిలిన్ లాంటి పిగ్మేంట్స్ అలాగే తియమిన్, రిబోఫ్లావిన్ ఉంటాయి.ఇక పాలకూర వలన మన శరీరానికి దొరికే లాభాలేంటో, పాలకూరని మనం ఎందుకు ఇష్టపడాలో చూద్దాం.

* పాలకూరలో బేటా కరోటిన్, లూటిన్, జన్తెన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా.ఈ ఎలిమెంట్స్ మన కనుల ఆరోగ్యానికి మంచివి.కనులకి ప్రశాంతంగా ఉంచడమే కాదు, కంటిచూపు సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి ఇవి.

* పాలకూరలో C0-Q10 అనే యాంటిఆక్సిడెంట్ ఉంటుంది.ఇది మన శరీరంలో ఉన్న అన్ని కండరాలకి మంచిది.ముఖ్యంగా గుండె కండరాలకి.ఇది రక్తప్రసరణ బాగా జరగటానికి కారణం అవుతుంది.గుండె సంబంధిత వ్యాధులను సాధ్యమైనంతవరకు దూరం పెడుతుంది.

* పలకూరలో విటమిన్ కె, ఫాస్పోరస్, మగ్నేశియం, జింక్, కాపర్ లాంటి మినరల్స్ ఉంటాయి.ఇవి మన ఎముకలకి చాలా అవసరం.

పాలకూర ఎముకలకి అందాల్సిన మినరల్స్ అందిస్తుంది.ఎముకలని బలంగా చేస్తుంది.

* పాలకూరలో ఫోలేట్, టోకోఫెరాల్, క్లోరోఫైలిన్ లాంటి యాంటి-క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి.వీటిని క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాడతారు.

అందుకే పాలకూర తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.పాలకూర బాగా తింటే, వచ్చిన క్యాన్సర్ పెరగకుండా చూసుకోవడమే కాదు, లేని క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.

* ఈ ఎండకాలంలో పాలకూర మనకి బాగా పనికివచ్చే ఆహారం.ఇందులో పిగ్మేంట్స్ ఉంటాయని ఇప్పటికే చెప్పుకున్నాం.ఇవి ఈ ఎండలో, మన చర్మం మీద దండయాత్ర చేసే యువి రేస్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.ఈ ఎండలో చర్మానికి నష్టాల శాతాన్ని తగ్గిస్తాయి.స్కిన్ క్యాన్సర్ అవకాశాలు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.మీరు ఎండలో తిరగక తప్పదు అంటే, పాలకూర ఎక్కువ తినండి.

* పాలకూరలో ఐరన్ శాతం ఎక్కువే.రక్తదానం చేసినవారు పాలకూరను డైట్ లోకి చేర్చుకోవాలి.

అమ్మాయిలు పీరియడ్స్ లో రక్తాన్ని కోల్పోతారు కాబట్టి, మీరు పాలకూర తప్పనిసరిగా తినాలి.ఇక రక్తలేమి లాంటి తీవ్రత ఉన్న సమస్య ఉంటే, పాలకూర తినడం ఖచ్చితం.

* పాలకూరని మొటిమల ట్రీట్మెంట్ కోసం కూడా ఉపయోగించవచ్చు అని తెలుసా ? పాలకూరని పేస్ట్ లాగా చేసుకొని రోజు ఫేస్ ప్యాక్ లా పెట్టుకోండి.ఓ ఇరవై నిమిషాలపాటు ఉంచుకొని కడుక్కోండి.

ఇలా రెగ్యులర్ గా చేస్తే, ఆయిల్ తగ్గుతుంది, ముఖం మీద ఉన్న దుమ్ముదూలి పోతుంది, మొటిమలు తగ్గుతాయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

* పాలకూర లాభాలు ఇక్కడితో అయిపోలేదు.

ఇది చర్మ ఆరోగ్యానికి ఏంతో మంచిది.నరాల బలహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధకశక్తిని పెంచుతుంది , గ్యాస్ సమస్య తగిస్తుంది, మెదడు పనితనాన్ని పెంచుతుంది .ఇలా చెప్పుకుంటూ పొతే ఇంకా చాలా పెద్ద లిస్టు ఉంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు