మెడ ఎంత నల్లగా ఉన్నా సరే ఈ హోమ్ మేడ్ క్రీమ్ వాడితే తెల్లగా మెరుస్తుంది!

సాధారణంగా కొందరి ముఖం ఎంతో తెల్లగా, మృదువుగా, కాంతివంతంగా మెరిసిపోతూ కనిపిస్తుంది.కానీ మెడ మాత్రం నల్లగా అందవిహీనంగా ఉంటుంది.

 This Is The Home Made Cream To Get Rid Of Black Neck! Homemade Cream, Dark Neck,-TeluguStop.com

శరీరంలో అధిక వేడి, హార్మోన్ చేంజ్, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, ఎండల ప్రభావం, మృత కణాలు పేరుకుపోవడం త‌దిత‌ర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.దాంతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ గ్రేట్ గా సహాయపడుతుంది.

మెడ ఎంత నల్లగా ఉన్నా సరే ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే కొద్ది రోజుల్లోనే తెల్లగా అందంగా మెరుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ), చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని బాగా కలిపి నైట్ అంతా వదిలేయాలి.

మరసటి రోజు కుంకుమ పువ్వు వేసిన రోజ్ వాటర్ లో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ), మూడు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను మెడకు బాగా అప్లై చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ హోమ్ మేడ్ క్రీమ్‌ ను వాడితే ఎంత నల్లగా ఉన్న మెడ అయినా సరే కొద్ది రోజుల్లోనే తెల్లగా, మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.మెడ నలుపును వదిలించడానికి ఈ క్రీమ్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ హోమ్‌ మేడ్ క్రీమ్ ను ముఖానికి కూడా ఉపయోగించవచ్చు.స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేయడానికి, మొటిమలు వాటి తాలూకు మచ్చల‌ను నివారించడానికి ఈ క్రీమ్ అద్భుతంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube