ఇటీవల నయనతారపై ఏదో ఒకటి మాట్లాడుతూ వ్యక్తిగా నిలిచేందుకు తెగ ప్రయత్నిస్తుంది హీరోయిన్ మానవిక మోహనన్.మొదట్లో నయనతారను ఉద్దేశించి రాజు రాణి సినిమాలో మేకప్ తో హాస్పిటల్ బెడ్ పైన పడుకొని షూట్ చేసింది, హాస్పిటల్ లో ఉంటె కూడా మేకప్ ఎందుకు అంటూ పేరు చెప్పకుండానే నయనతార పై సీరియస్ కామెంట్స్ చేసింది మాళవిక.
నయనతార కూడా ఇందుకు ప్రతి సమాధానం ఇచ్చింది.దర్శకుడికి ఏది కావాలో అదే చేస్తాను.
కమర్షియల్ సినిమాల్లో ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటామా ? ఏది వేసుకోవాలి ఏది వేసుకోకూడదు అనేది ఒక డైరెక్టర్ మాత్రమే నిర్ణయిస్తాడు.బాగుంటే చూస్తారు లేదంటే లేదు మధ్యలో మిగతా వారికి ఏంటి ప్రాబ్లం అన్నట్టుగా ప్రశ్నించింది.
ఇక దొరికిందే సందు అన్నట్టుగా మరోసారి నయనతారపై మాళవిక కామెంట్స్ చేసింది.లేడీ సూపర్ స్టార్ అనే పదం పై అమే తాజాగా వ్యాఖ్యానించింది.సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్ మాత్రమే.అందులో లేడీ వేరు, జెంట్ వేరు ఎంటి అని మాళవిక కడిగేసింది.ఇలా అవసరం ఉన్నా లేకపోయినా నయనతారపై కామెంట్స్ చేస్తూ మాళవిక వార్తల్లో నిలుస్తూ ఉండడం విశేషం.మరి మాళవిక కేవలం నయనతారను టార్గెట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న.
పైగా మా లేడీస్ సూపర్ స్టార్ పైన నోటికి వచ్చింది మాట్లాడుతావా అంటూ నయనతార అభిమానులు మాళవికను ట్రోల్ చేయడం మొదలుపెట్టాక నేను అలా అనలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఏది ఏమైనా ఇలా సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేస్తే తాము కూడా సెలబ్రిటీలను అవుతాము అన్న స్పృహతోనే కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు.ఇక మాళవిక విషయానికొస్తే ఆమె తమిళనాడులో ఓ హీరోయిన్ మాత్రమే స్టార్ హీరోయిన్ అయితే కాలేదు.సెకండ్ మరియు థర్డ్ లేయర్ హీరోయిన్.
అంతగా ఆమెకు చెన్నైలో పెద్ద పాపులారిటీ ఏమీ లేదు.ఇప్పటివరకు కేవలం 9 సినిమాల్లోనే నటించేది.
గత పదేళ్లుగా ప్రయత్నిస్తున్న ఆమె ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు.ఇక తెలుగులో అయితే ఎలాంటి సినిమాలు నటించలేదు.
మనవారికి మాళవిక ఎవరో తెలియని కూడా లేదు.అందుకే సీనియర్లను గెలికితే ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటారు కాబట్టి జనంలో నానుతూ ఉంటారు కాబట్టి తమకు కాస్త పబ్లిసిటీ వస్తుంది అనే భ్రమలో మాళవిక మోహనన్ ఇలా చేస్తోంది.