రాత్రిపూట కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణాలు..

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలలో గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా పెరిగిపోతోంది.గ్యాస్టిక్ సమస్య భారతదేశంలో చిన్న వయస్సు నుంచి పెద్ద వయసు వారి వరకు చాలామంది ఎదుర్కొంటున్నారు.

 Causes Of Stomach Gas Formation At Night Details, Stomach Problems, Stomach Gas,-TeluguStop.com

రాత్రి నిద్ర పోయే సమయంలో కడుపులో గ్యాస్ ఉత్పత్తి పెరిగిపోతోంది.దీని వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు.

చాలామందికి కడుపులో మంటగా ఉంటుంది.అయితే రాత్రిపూట కడుపులో గ్యాస్ ఎందుకు ఏర్పడుతుంది.

దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే కొందరికి రాత్రి పూట ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది.

దీంతో కడుపులో గ్యాస్ ఏర్పడడం వేగంగా జరుగుతుంది.సాధారణంగా రాత్రి పూట పార్టీలు, విందులకు బయటకు వెళ్లడానికి చాలామంది ప్రజలు ఇష్టపడుతుంటారు.

ఈ పరిస్థితులలో సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.విందులో ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ పెరుగుతుంది.

ఇది తినడం వల్ల కడుపుకు అసలు మంచిది కాదు.

Telugu Tips, Healthy, Junk, Oily, Stomach Ache, Stomach Gas-Telugu Health

ఆహారం జీర్ణం కావడానికి కనీసం 6 గంటల సమయం పడుతుంది.అయితే సాయంత్రం స్నాక్స్ లో ఎక్కువ నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలను తింటే రాత్రి భోజనం తర్వాత కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ కారణంగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల్లో నడవండి.ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Tips, Healthy, Junk, Oily, Stomach Ache, Stomach Gas-Telugu Health

కొందరికి ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది.ఈ పరిస్థితుల్లో జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడి కడుపులో గ్యాస్ మొదలవుతుంది.మీరు రోజంతా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగకపోతే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇది గ్యాస్ సమస్యను పెంచడానికి కారణమవుతుంది.అందుకే లంచ్, డిన్నర్ టైమింగ్ కచ్చితంగా పాటించడం మంచిది.రాత్రిపూట ఎప్పుడు హెవీ లేదా ఆయిల్ ఫుడ్ తినకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube