లక్ష్మి భూపాల .ఈయన అసలు పేరు భూపాల వెంకట దుర్గ ప్రసాద్.
డైరెక్టర్ కృష్ణ వంశీ అయన పేరును చందమామ సినిమా సమయంలో లక్ష్మి భూపాల గా మార్చేశారు.ప్రస్తుతం అయన చిరంజీవి సినిమా అయినా గాడ్ ఫాదర్ కి డైలాగ్ రైటర్ గా పని చేసారు.
ఈ సినిమా విజయం సాదించిందాం తో ప్రస్తుతం అందరు ఈయనే గురించి మాట్లాడుకుంటున్నారు.లక్ష్మి భూపాల ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి అయన కొన్నేళ్ల కష్టం దాగి ఉంది.
ఎక్కడో ఏలూరు పుట్టి పెరిగిన వ్యక్తి, కేవలం ఒక తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి ఈ రోజు డైలాగ్ రైటర్ గా మారడం అనేది ఒక అద్భుతమే.
తన తండ్రి APSRTC లో చేసిన ఉద్యోగాన్ని తనకు ఇస్తే కుటుంబం కోసం మెకానిక్ గా మారాడు.
కానీ ఆ రోజు ఆయనకు తెలుసు ఇది తన లక్ష్యం కాదు అని.తనకు బాగా ఊహ తెలిసినప్పటి నుంచి చిత్ర కల పైన ఎంతో ఆసక్తి.తాను అందులోనే నిష్ణాతుడవ్వాలని అనుకున్నాడు.కానీ కేవలం కుటుంబం కోసం ఆర్టీసీ లో మెకానిక్ పని చేసాడు.బహుశా ఇలా ఆశయాలను చంపుకొని కేవలం కుటుంబం కోసం అన్ని త్యాగం చేసే వాళ్ళు చాల అరుదుగా ఉంటారేమో.లక్ష్మి భూపాల చాల చిన్న వయసులో ఉండగానే తండ్రిని పోగొట్టుకున్నాడు.
మూడేళ్ళ పాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత చిత్ర కళ వెళ్ళాడు.
కానీ అది కడుపు నింపాడని తెలుసుకొని సినిమా రంగంలోకి తల పెట్టాడు.మొదటి నుంచి సినిమా అంటే లక్ష్మి భూపాల కు చిన్న చూపే.ఇక్కడ తాగుతారు, తిరుగుతారు అనే భయం.అందుకే సినిమా జోలికి వెళ్ళకూడదు అనుకున్న కుటుంబం ఆకలి తీర్చడానికి తప్పలేదు.ఆలా మొదలైన సినీ ప్రయాణం చందమామ , నేనే రాజు నేనే మంత్రి, సీత వంటి సినిమాలతో ఇక్కడే పాతుకుపోయేలా చేసింది.
ఆ తర్వాత అనేక మంచి చిత్రాలకు మాటలు రాసి ఇప్పుడు గాడ్ ఫాదర్ వంటి సినిమాకు పని చేయడం నిజంగా ఎంతో గ్రేట్.ఇంకా ఎన్నో మంచి సినిమాలకు డైలాగ్స్ రాసి సినిమా విజయవంతం అవ్వడం లో తనదైన పాత్ర లక్ష్మి భూపాల గారు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.